ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫ్లైఓవర్ మీద టెక్కీ భార్య ఏం చేసిందంటే ?, ఫ్యామిలీతో !
కుటుంబ కలహాలతో ఓ టెక్కీ భార్య ఉదయం వాకింగ్‌కు వెలుతూ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని చిక్కతూగూర్‌లోని నైస్ రోడ్డు ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. జార్ఖండ్‌కు చెందిన టెక్కీ భార్య ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆమె ముఖంపై బలమైన గాయాలు, ఆమె కాళ్ళ ఎముకలతో పాటు శరీరంలోని ఇతర భాగాలు చాలా వరకు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని చిక్కతూగూరు ఫ్లైఓవర్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని పోలీసులు అన్నారు. నైస్ రోడ్డు ఫ్లైఓవర్ నుంచి ఓ మహిళ దూకింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరిన ఆ మహిళ వంతెనపై నుంచి కిందపడిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోయిన మహిళను జార్ఖండ్‌కు చెందిన యమికా మిశ్రా (28)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. యామిక మిశ్రా భర్త బెంగళూరులోని టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగి. బ్రిడ్జిపై నుంచి కింద పడిన యామిక మిశ్రా ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడే కదలలేక కోమాలోకి వెళ్లిపోయిందని గుర్తించిన స్థానికులు హడలిపోయారు. అటువైపు వాహనాలలో వెలుతున్న వాళ్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు.

యామిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నదని, ఆమె కోలుకున్న తర్వాత ఆమె నుంచి వివరాలు సేకరిస్తామని పోలీసులు అన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే యామిక ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications