solar eclipse 2023: గ్రహణం రోజులలో తెరచి ఉండే భారతదేశంలోని ఆలయాలివే!!

ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే భారతదేశంపై మొదటి సూర్య గ్రహణం ప్రభావం చూపదని చెబుతున్నారు. రేపు సంభవించనున్న సూర్యగ్రహణం కారణంగా దేశంలోని ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. గ్రహణ గడువు ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి ప్రదోషకాల పూజలు నిర్వహించి ఆలయాలను తిరిగి తెరుస్తారు. అయితే కొన్ని ఆలయాలకు మాత్రమే గ్రహణం రోజు మినహాయింపు ఉంటుంది.

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాళహస్తీశ్వర ఆలయంతో పాటు, కర్నూలులోని సంగమేశ్వర ఆలయం, కొట్టాయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరప్పు ఆలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయాలు గ్రహణం రోజున కూడా తెరిచే ఉంటాయి. ఈ నాలుగు ఆలయాలపై గ్రహణం ప్రభావం ఉండదని చెబుతారు. కాలహస్తీశ్వర ఆలయంపై రాహు కేతువుల ప్రభావం ఉండదని, గ్రహణం ప్రభావం చూపించదని చెప్తారు. అందుకే ఈ ఆలయం తెరచి ఉంటుంది.

Solar eclipse 2023

కర్నూలు జిల్లాలో శ్రీశైలం సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలోనూ గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్య గ్రహణ సమయంలో సంగమేశ్వర ఆలయంలో అరుణ హోమం నిర్వహిస్తారు. అలాగే కేరళలోని తిరువరప్పు క్షేత్రంలోనూ, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలోనూ గ్రహణం ప్రభావం చూపదు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాన ద్వారాలన్నీ గ్రహణ సమయం లోనూ తెరిచి ఉంచుతారు.

అయితే గ్రహణకాలంలో ఇక్కడ ఉన్న శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిలిపి వేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేసి అనంతరం పూజాదికాలను నిర్వహిస్తారు. కేరళలోని తిరువరప్పులోనూ గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. గ్రహణ సమయంలో స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించి, అదే సమయంలో స్వామివారి ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు.

Solar eclipse 2023

అలా చేస్తే వారి జీవితంలో ఆకలి బాధలు రావని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. దేశం మొత్తంలో ఈ నాలుగు ఆలయాలలోనే గ్రహణాల సందర్భంగా మినహాయింపు ఉంటుంది. ఈ ఆలయాలపై గ్రహణం ప్రభావం చూపని కారణంగా గ్రహణాల రోజుల్లో కూడా ఆలయాలను తెరిచి ఉంచుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+