ఆర్నెల్ల చిన్నారి ముందే తల్లి హతం .. తండ్రి వచ్చేవరకు తల్లడిల్లిన ప్రాణం ...

థానె : ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి. మనుషుల్లో క్రూరత్వం కూడా ఎక్కువవుతున్నాయి. కొన్ని చోట్ల పిల్లలనీ చూడకుండా మట్టుబెడుతుంటే .. మరికొన్ని చోట్ల పిల్లలను ఆనాథలను చేస్తున్నారు. ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని థానెలో జరిగింది. తల్లిన హతమార్చిన దుండగులు .. ఆరునెలల చిన్నారని వదిలేసి వెళ్లిపోయారు. అయితే తన తండ్రి వచ్చేవరకు ఆ చిన్నారి గద్గత స్వరంతో రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.

తల్లిపై దాడి ..
మహారాష్ట్రలోని థానేలో జిల్లాలో దారుణం జరిగింది. సింతన్‌దేవి యాదవ్ (23) అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే వారు ఎవరు ? ఎందుకు దాడి చేశారు ? అన్న విషయాలపై క్లారిటీ రాలేదు. కానీ ఆమెకు ఆరు నెలల చిన్నారి ఉంది. ఆ కర్కశులు సింతన్‌ను కడతేర్చి మెల్లగా జారుకున్నారు. వారు ఎవరు దోపిడీ దొంగలా ? లేదంటే వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా అనే విషయంపై క్లారిటీ రాలేదు.

some one killed 6 months child mother ..

విగతజీవిగా అమ్మ ...
ఈ ఘటన మధ్యాహ్నం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అప్పటికే ఆఫీసుకు వెళ్లిన భర్త .. సాయంత్రం తిరిగొచ్చాడు. అయితే రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి హతాశుడయ్యాడు. పక్కనే చిన్నారిని చూసి నిర్ఘాంతపోయాడు. ఎవరోచ్చారు ? ఎందుకు తన భార్యను పొట్టన పెట్టుకున్నారో అర్థం కావడం లేదు. విగతజీవిగా ఉన్న తల్లి పక్కన చిన్నారిని చూసి బోరుమని విలపించాడు. ఎంత కష్టం వచ్చిందని గుండెలవిసేలా రోదించాడు. ఆ చిన్నారిని చూస్తూ అతని కన్నీరు ఆగలేదు. భర్త ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. సింతన్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో హత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఎవరితోనైనా శత్రుత్వం ఉందా ? ఎవరైనా బెదిరించరా ? అని సింతన్ భర్త వద్ద నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ప్రాథమిక వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+