డాడీకి ఓటేయండి: శతృఘ్ను కూతురు సోనాక్షి సిన్హా
ముంబై: అవినీతి రహిత భారత్ నిర్మాణానికి, దేశంలో మార్పు రావాలని, మార్పును కోరుకుంటున్న వారికి ఇదే సరైన అవకాశమని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అన్నారు. బిజెపి నాయకుడు శతృఘ్ను సిన్హా కూతురైన ఆమె పరోక్షంగా తన తండ్రికి ఓటేయాలని చెప్పారు.
తమ ఓటు హక్కుతో ఈ మార్పును సాధించుకునే సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసే పార్టీకి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తన తండ్రి చెపుతుండేవారని, ఇపుడు ఆయన అలాంటి పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

అందువల్ల దేశ ప్రజలు కూడా మంచి పార్టీ అయిన బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె పిలుపునిచ్చారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా సాహబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే.
నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తారని తాను భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని, తనకిష్టమైన సినిమా పరిశ్రమలోనే కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పారు. శతృఘ్ను సిన్హా రాజకీయాల్లోకి రాక ముందు విజయవంతమైన పలు హిందీ సినిమాల్లో హీరోగా నటించారు.












Click it and Unblock the Notifications