సిద్దరామయ్యకు క్లాస్ ఇచ్చిన సోనియా గాంధి
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు విషయంలో సిద్దరామయ్య వ్యవహరిస్తున్న తీరుపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాందీ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాఎందుకు మొండి పట్టు పడుతున్నారంటూ సిద్ధరామయ్యకు క్లాస్ ఇచ్చారు. వెంటనే కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో సిద్దరామయ్య డీలా పడ్డారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దని ఆమె చెప్పారు.
శుక్రవారం సోనియా గాంధి సిద్దరామయ్యకు ఫోన్ చేశారు. ఐఏఎస్ అధికారి రవి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ధర్నా నిర్వహించి రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోడికి లక్షల మంది ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తు చేస్తూ ఈ విషయాలు మీ దృష్టికి రాలేదా అని ప్రశ్నించారని తెలిసింది.

ఇంత జరుగుతున్నా మీరేందుకు స్పందించలేదని, మా
దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సోనియా గాంధి క్లాస్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకుండ వెంటనే కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సూచించారు. అధిష్టానం ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇక చేసేది లేక కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిర్ణయించారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాల సలహాదారుడు అహ్మద్ పటేల్, కేపీసీసీ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సిద్దరామయ్యకు ఫోన్ చేసి క్లాస్ ఇచ్చారు. కర్ణాటకలోని తమ సొంత పార్టీకి చెందిన సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని చెబుతూ మీరు ఎందుకు రవి కేసు విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. సోనియా ఆదేశాలు పాటించకుంటే మూల్యం చెల్లించుకుంటారని సిద్దరామయ్యను హెచ్చరించారిని తెలిసింది.
ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసు విషయంలో కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సోంత పార్టీ నాయకులు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై అధిస్టానానికి ఫిర్యాదులు చెయ్యడంతో సిద్దరామయ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తన సీటుకు ఎసరు వస్తుందని గ్రహించి ఆలస్యంగా మేలుకున్నారు.












Click it and Unblock the Notifications