వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు లేఖపై అహ్మద్ పటేట్ ట్విస్ట్ - ఏడాది కిందట ఆమెనే కోరింది - వద్దని చెప్పినా సీనియర్లు వినలే

|
Google Oneindia TeluguNews

జాతీయ కాంగ్రెస్ పార్టీలో 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన వ్యవహారంపై ఇంకా కాక కొనసాగుతున్నది. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో లేఖ రాసిన సదరు సీనియర్లపై మండిపడ్డవాళ్లలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కూడా ఒకరు. నిన్నంతా లేఖపై చిర్రుబుర్రులాడిన ఆయన.. మంగళవారం ట్విస్టింగ్ కామెంట్లు చేశారు.

యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారంయముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారం

ఇది పార్టీలోని నేతలకు, అధినేత్రికి మధ్య చోటుచేసుకున్న వ్యవహారమని, పైగా, ఏడాది కిందటే సోనియా గాంధీ స్వయంగా గాంధీయేతర వ్యక్తిని పార్టీ చీఫ్ గా నియమించాలని చెప్పినట్లు అహ్మద్ పటేల్ గుర్తుచేశారు. పార్టీలో పెనుదుమారం రేపిన లేఖ గురించి రెండు నెలల కిందటే తనకు సమాచారం ఉందని, ఆనంద్ శర్మ, భూపేంద్ర సింగ్ హుడాలు ఈ అంశాన్ని తన దగ్గర ప్రస్తావించగా.. లేఖ రాయడం కంటే సోనియాను నేరుగా కలవడమే మంచిదని సలహా ఇచ్చానని, కానీ వాళ్లు వినకుండా లేఖ పంపడం వివాదాస్పదమైందని పటేల్ అన్నారు.

Sonia Gandhi also asked for non-Gandhi president, says Ahmed Patel, slams dissidents

''మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని అందరికీ తెలిసిందే. ఎవరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ మాకే సొంతం. అయితే, నాయకత్వం సామర్థ్యాన్నే సవాలు చేసే స్థాయిలో ఉన్న ఇంత కీలకమైన అంశాలను లేఖల ద్వారా బహిరంగ పర్చేకంటే, పార్టీ వేదికలపైనే చర్చించుకోవడం మంచింది. ఈ విషయాన్ని మా వాళ్లకు చెబితే మొదట సరేనన్నారు. కానీ చివరికదే చేశారు. అయితే ఇది పార్టీ నేతలకు, నాయకురాలికి మధ్య జరిగిన విషయమేనని అందరూ గుర్తుంచుకోవాలి'' అని పటేల్ చెప్పారు. మంగళవారం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్ షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్

2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తన రాజీనామాను సమర్పిస్తూ, గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరారని, ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోగానీ, గతేడాది ఆగస్టులో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోగానీ సోనియా గాంధీ సైతం రాహుల్ తరహాలోనే 'నాన్ గాంధీ చీఫ్' ఎంపిక జరగాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారని అహ్మద్ పటేల్ గుర్తుచేశారు. ఓవైపు సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, లేఖ లోని అంశాలు పాతవేనని పటేల్ చెప్పడం పార్టీలో తాజాగా చర్చనీయాంశమైంది.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి

నిజానికి సోమవారం నాటి సీడబ్ల్యూసీ భేటీలో కొత్త నాయకత్వం ఎంపిక, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండా అయినప్పటికీ, సీనియర్ల లేఖపై రచ్చ జరగడంతో ఆ ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. సీడబ్ల్యూసీ మెంబర్ అయిఉండీ అసమ్మతి లేఖపై సంతకాలు చేసిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్ పై రాహుల్ గాంధీ, ప్రియాంక సహా మిగతా సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమ్మతిదారులు బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ రాహుల్ ఫైరయ్యారని వార్తలు రాగా, వాటిని అందరూ ఖండించారు. చివరికి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలనే తీర్మానంతో సమావేశం ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే.. ఆరు నెలల వ్యవధిలో నాన్ గాంధీ అధ్యక్షుణ్ని ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుదంటూ ఏఐసీసీ ప్రకటన చేసింది.

English summary
Congress leader Ahmed Patel, who tore the dissidents in Congress Working Committee (CWC) earlier, says Sonia Gandhi had asked Congress leaders to pick a non-Gandhi president a year ago. while speaking to media on tuesday, Patel said, "This is a matter between the leaders and their president".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X