నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నా-నిరాశపర్చడు- రాయ్ బరేలీ ఓటర్లతో సోనియా..!

లోక్ సభ ఎన్నికలు ఐదో దశకు చేరుకున్నాయి. ఈ నెల 20న పలు రాష్ట్రాల్లో ఐదో దశ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఓటేయాలని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీని ఇవాళ ఆయన తల్లి సోనియా గాంధీ రాయ్ బరేలీ ఓటర్లకు పరిచయం చేశారు. గతంలో తనను పలుమార్లు గెలిపించిన రాయ్ బరేలీ ఓటర్లకు ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు సోనియా అక్కడ పర్యటించారు.

రాయ్ బరేలీలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న సోనియా గాంధీ.. తన కుమారుడు రాహుల్ గాంధీని మీ చేతుల్లో పెడుతున్నా, వాడు మిమ్మల్ని నిరాశపర్చడంటూ అక్కడి ఓటర్లకు తెలిపారు. గతంలో తనకు అండగా నిలిచినట్లే ఇకపై తన కుమారుడికి కూడా అండగా నిలవాలని సోనియా ఓటర్లను కోరారు. రాహుల్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడంటూ సోనియా వారికి హామీ ఇచ్చారు.

Sonia Gandhi introduced rahul gandhi to rae bareli voters asked to support like her earlier

ఇందిరా గాంధీ, రాయ్‌బరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలే తాను రాహుల్, ప్రియాంకలకు నేర్పానని సోనియా గాంధీ తెలిపారు. అందరినీ గౌరవించడం, బలహీనులను రక్షించడం, ప్రజల హక్కుల కోసం అన్యాయంపై పోరాడడం వంటివి రాహుల్ కు తాను నేర్పానన్నారు. భయపడొద్దు.. ఎందుకంటే మీ పోరాట మూలాలు, సంప్రదాయాలు చాలా లోతైనవని రాయ్ బరేలీ ఓటర్లతో సోనియా వ్యాఖ్యానించారు. తనకు వరుస విజయాలు అందించినందుకు రాయ్ బరేలీ ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Sonia Gandhi introduced rahul gandhi to rae bareli voters asked to support like her earlier

2004 నుంచి వరుసగా రాయ్ బరేలీలో పోటీ చేసి గెలుస్తున్న సోనియా గాంధీ.. అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో ఈసారి అక్కడ పోటీ నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్లారు. తాను వదిలేసిన గాంధీల కంచుకోట రాయ్ బరేలీలో కుమారుడు రాహుల్ గాంధీని బరిలోకి దింపారు. ఇక్కట తొలుత ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని భావించినా ఇప్పటికే కుటుంబ పార్టీగా తమపై ఉన్న విమర్శలు నిజం చేయకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉండిపోయారు. దీంతో గత ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిన రాహుల్.. ఈసారి తన సిట్టింగ్ సీటు కేరళలోని వాయనాడ్ తో పాటు రాయ్ బరేలీలో పోటీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+