ముగిసిన సోనియా గాంధీ విచారణ-3 గంటల తర్వాత ఇంటికి-పలుచోట్ల కాంగ్రెస్ ఆందోళనలు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లపై స్పందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగిన విచారణలో ఆమెను అధికారులు మూడు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాధీనంతో పాటు ఆమె పాత్ర, ఇతర లావాదేవీలపై సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం తర్వాత సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె Z+ కేటగిరీ సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ తో అక్కడికి వచ్చారు. కోవిడ్‌తో బాధపడుతున్న సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు. ఇవాళ విచారణలో కాంగ్రెస్ అధినేత్రికి ఈడీ 50 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.విచారణ జరుగుతున్న సమయంలో ఆమె కుమార్తె ప్రియాంకను ఈడీ ఆఫీసు భవనంలోనే ఉండి, తల్లికి అవసరమైతే మందులు ఇచ్చేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మూడు గంటల విచారణ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు

Sonia Gandhi leaves ED office after 3 hrs of questioning , congress protests across country

ఈడీ అధికారుల విచారణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించింది. పార్టీ అధినేత్రికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించడంతో పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన బల ప్రదర్శనల్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ నేతలు 'ఈడీ దుర్వినియోగాన్ని ఆపండి' అంటూ పెద్ద పెద్ద బ్యానర్‌లు పట్టుకుని పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల మార్చ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల, నిరసనకారులు రైళ్లను నిలిపివేసారు మరియు వాహనాలను కూడా తగులబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+