Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంతకు తెగించార్రా.. కన్నతండ్రిని పాముకాటుతో చంపించి..

డబ్బు కోసం కన్న తండ్రినే చంపించారు ఇద్దరు కొడుకులు. కనిపెంచి పెద్దవాళ్లను చేసిన కన్నతండ్రినే కిరాతకంగా పాము కాటుతో చంపించారు. ఇన్సురెన్స్ డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా పాము కాటుతోనే తమ తండ్రి మరణించాడని చెప్పుకొచ్చారు. కానీ బీమా సంస్థ అధికారులకు కుమారులపై అనుమానం రావడంతో ఎట్టకేలకు నిజం బయటపడింది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా పోతాతుర్ పెట్టాయ్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న 53 ఏళ్ల ఈపీ గణేశన్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. అయితే తన తండ్రి పాము కాటుతో చనిపోయాడని అందరినీ నమ్మించారు ఆ ఇద్దరు కుమారులు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశన్ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అప్పటికే తన తండ్రిపై రూ. 3 కోట్ల బీమా చేయించారు కుమారులు.

ఇక గణేషన్ అంత్యక్రియల తర్వాత ఇన్సురెన్స్ డబ్బు కోసం బీమా సంస్థ వద్దకు వెళ్లగా.. గణేషన్ మృతి చెందిన విధానం.. ఆ ఇద్దరు కుమారుల ప్రవర్తన.. తదితర కారణాలతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నార్త్ జోన్ అస్రా గార్గ్ తెలిపారు. అయితే విచారణలో ఇన్సురెన్స్ డబ్బు కోసమే గణేషన్ ను ఆ ఇద్దరు కుమారులు.. పాము కాటుతో చంపించారని గుర్తించారు.

Sons Deadly Betrayal Father Killed with Venomous Snake for 3 Crore Insurance in Tamil Nadu

తొలి ప్లాన్ లో భాగంగా కోబ్రా పాముతో కాటు వేయించి చంపాలని గణేషన్ రూమ్ లోకి పామును వదిలారు. అయితే ఆ పాము కాటు వేయకపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. కొద్దిరోజుల తర్వాత మరో ప్లాన్ వేశారు ఇద్దరు కుమారులు. ఈసారి అత్యంత విషపూరితమైన క్రెయిట్ పామును తీసుకొచ్చారు. ఆ పాము గణేషన్ మెడపై కరిచింది. వెంటనే ఆ పామును ఇంట్లోనే చంపి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత గణేషన్ ను వెంటనే కాకుండా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఈ విషయాలు పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో భాగంగా ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+