సోనూ సూద్.. విద్యార్థుల కోసం ఏకంగా టవర్, శభాష్ అంటూ ప్రశంసలు
ఏ సమస్య వచ్చిన సాయం చేయడమే తెలుసు.. అవును చెబుతుంది సోనూ సూద్ గురించే. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించిన తొలినాళ్ల నుంచి ఆయన మంచితనం ప్రపంచానికి తెలిసింది. సాయం చేయమని కోరితే చాలు.. ఇట్టే హెల్ప్ చేస్తున్నారు. అలా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా విద్యార్థుల కోసం మరో మంచి పని చేశారు. అదేంటో తెలుసుకుందాం. పదండి.

ఏకంగా టవరే..
కోట్ల మంది మనస్సులు గెలుచుకున్న సోనూసూద్.. మరో అడుగు ముందుకేశారు. కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా తలపెట్టారు. ఇప్పుడు వాయనాడ్‌లో విద్యార్థుల కోసం సెల్ ఫోన్ టవర్ నిర్మించాలని అనుకుంటున్నారు. ట్రైబల్ ఏరియాల్లో సిగ్నల్స్ లేని కారణంగా ఆన్ లైన్ క్లాసుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి క్లాసులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని చూసి ఆయన చలించిపోయారు. వారికి తనవంతు సాయం చేయాలని భావించి.. టవర్ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు.

సమస్య రావడంతో..
కొన్ని ఏరియాల్లో తక్కువ సిగ్నల్ వస్తుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ అస్సలు లేకపోవడంతో ఇబ్బంది కనిపిస్తుంది. విషయం సోనూ సూద్‌కు తెలియగానే మొబైల్ టవర్ నిర్మాణం చేయాలని ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు. దీని గురించి ట్వీట్ చేశారు. ఒక్కరు కూడా చదువును మిస్ చేసుకోకూడదని తెలిపారు. వాయనాడ్, కేరళలో ప్రతి ఒక్కరికీ చెబుతున్నానని.. తన టీం పంపించి అక్కడ మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. వెంటనే పనులు చూడాలని ఫౌండేషన్‌ను ట్యాగ్ కూడా చేశారు.

గ్రేట్..
ఇదీ నిజంగా గ్రేట్.. ఏ సమస్య అయినా సరే.. అదీ ఏ రూపంలో ఉన్న సరే.. మీకు సోనూ సూద్ ఉన్నారు. కరోనా వల్ల చదువులు చక్కగా సాగవని భావించి.. ఏకంగా టవర్ ఏర్పాటు చేస్తున్నాడు. నిజంగా అతని మంచి మనసుకు అందరూ శభాష్ అంటున్నారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ లాంటి వాళ్లు ఉంటేనే మిగతా అభాగ్యులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications