సోనుసూద్‌పై ఉద్దవ్ ప్రశంసలు, సంజయ్ అలా, మహా సీఎం ఇలా.. గంటల్లో మారిన రాజకీయం...
మహారాష్ట్రలో సినీ నటుడు సోను సూద్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. వలసకూలీలను స్వస్ధలాలకు పంపించేందుకు బస్సులను సోనుసూద్ ఏర్పాటు చేశారు. వారి అన్నపానీయాలు అందజేస్తూ.. గత 20 ఏళ్లలో తాను కూడబెట్టిన ఆస్తులను హారతి కర్పూరంలా వెచ్చిస్తున్నారు. మంచి చేస్తున్న నటుడిని అభినందించాల్సింది పోయి.. శివసేన నేత సంజయ్ రౌత్ నోరు పారేసుకున్నారు. మహాత్మా అంటూ సెటైర్లు వేశారు. అయితే ఆయన కామెంట్ చేసిన మరుసటి రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మంత్రి ఆదిత్య థాకరేతో సోను సూద్ సమావేశమయ్యారు.
ఆదివారం రాత్రి ముంబైలోని ఉద్దవ్ నివాసం మాతో శ్రీలో సోను సూద్ ఉద్దవ్, ఆదిత్యతో సమావేశమై.. వలసకూలీల సాయంపై చర్చించారు. తర్వాత సోను సూద్ చేసిన సాయాన్ని సీఎం ఉద్దవ్ థాకరే ప్రసంశించారు. ముంబైలో ఉన్న ఉత్తరాదికి చెందిన వలసకూలీలను తరలించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయం అని కొనియాడారు. అయితే అంతకుముందు శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించగా.. ఒక్క రోజులోనే ఉద్దవ్ ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Recommended Video
బీజేపీ రాసిచ్చిన స్కిప్ట్ మేరకు సోను సూద్ పనిచేస్తున్నారని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. వలసకూలీలను ఆదుకొని మహాత్మగా మారాడని వ్యంగ్యాస్త్రాలు సందించారు. సడెన్‌గా గాంధీజీ పుట్టుకొచ్చారు అని విమర్శలు చేశారు. అంతేకాదు గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో సోను సూద్ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే వెంటనే సోను సూద్.. ఉద్దవ్‌తో భేటీ కావడం.. ఆయన వెంటనే సోను సూద్‌ను ఆకాశానికి ఎత్తేయడం చకచకా జరిగిపోయింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications