Gautami Tadimalla: బీజేపీకి సీనియర్ నటి గౌతమి గుడ్ బై - చీటింగ్ ఆరోపణలు..!
తెలుగు, కన్నడం, తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి గౌతమి (gautami tadimalla) ఇవాళ ఆమె సొంత పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పాతికేళ్లుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. తమిళనాడులో బీజేపీ నేతగా ఉన్న ఆమె ఇవాళ పార్టీకి తీవ్ర భావోద్వేగంతో గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటానికి దారి తీసిన కారణాల్ని వెల్లడించారు.
బీజేపీ తరఫున తమిళనాడులో రాజకీయాలు చేస్తున్న గౌతమి.. కొంతకాలంగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉంటున్నారు. అదే సమయంలో తనను ఆర్ధికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ నేతలు కొందరు అండగా నిలవడంతో గౌతమి దీన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా అనుబంధం కొనసాగించిన కాషాయపార్టీని వీడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలోని విశాఖపట్నంలో చదువుకుంటున్న సమయంలోనే సినీ రంగంలోకి ప్రవేశించిన గౌతమి.. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ తెలుగు, తమిళ, కన్నడతో పాటు పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలోనూ గౌతమి పలు సినిమాలు చేశారు. అదే సమయంలో బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరిన గౌతమి.. తమిళనాడులో ఆ పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా పోవడంతో పాటు తనకు ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.
2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ను ఆశించినా పార్టీ మాత్రం ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత తనను ఆర్దికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి బీజేపీ నేతలు అండగా నిలిచారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన ఫలితం లేకపోవడంతో బీజేపీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఆమె పోలీసులు, న్యాయ వ్యవస్ధపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే త్వరలో అధికార డీఎంకే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications