వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్కించాల్సిందే: అవిశ్వాసం ఇచ్చిన పార్టీలకు స్పీకర్ ట్విస్ట్, మళ్లీ నోటీస్ ఇస్తామని ఖర్గే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన పార్టీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం భేటీ అయ్యారు. సభలో సభ్యుల సంఖ్య లెక్కించకుండా అవిశ్వాసం నోటీసు పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం సభ్యులతో మాట్లాడారు.

Recommended Video

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోతే రాజీనామా కి సిద్ధంగా ఉన్న వైసీపీ ఎంపీలు

ఈ సందర్భంగా స్పీకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం కలిస్తే ఎక్కువ మంది సభ్యులే ఉంటారని అందరూ భావించారు. కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం సభ్యులను లెక్కించాల్సిందేనని చెప్పారు.

Speaker meets parties to break logjam in Lok Sabha

అంతకుముందు కాంగ్రెస్ లోకసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు వస్తే అన్ని సమస్యలతో పాటు అన్నాడీఎంకే సభ్యులు పట్టుబడుతున్న కావేరీ బోర్డు అంశం కూడా చర్చించవచ్చునని చెప్పారు. తాము కూడా కావేరీ బోర్డుపై నిలదీస్తామన్నారు. రేపు మరోసారి అవిశ్వాసం ఇస్తామన్నారు. మరోవైపు వైసీపీ మరోసారి అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది.

English summary
Lok Sabha Speaker Sumitra Mahajan today reached out to leaders of different political parties and may hold an all-party meeting to break the logjam in the House, official sources said. The lower house stands adjourned for the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X