మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్.. ఒళ్లంతా బంగారు నగలతో గోల్డెన్ బాబా!
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు మహా కుంభమేళాలో సంగమ స్నానాలు చేయడానికి విచ్చేస్తున్నారు. కోట్లాదిమంది సాధువులు సంగమ స్నానాలు చేస్తూ ఈ అమృత స్నానం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు.
కుంభ మేళాలో ఆసక్తిని కలిగిస్తున్న బాబాలు
అయితే మహాకుంభమేళలో చాలామంది అక్కడికి వెళ్లిన భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎంతోమంది ఉన్నత విద్యావంతులు, కోట్ల రూపాయల జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఆ ఉద్యోగాలను వదిలి సాధువులుగా మారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక మహా కుంభమేళాలో ఐఐటి బాబాలు, కాంటే వాలా బాబాలు, రుద్రాక్ష బాబాలు రకరకాలుగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఒళ్లంతా బంగారంతో సందడి చేసిన గోల్డెన్ బాబా
ఇక తాజాగా మహా కుంభమేళాలో ఒళ్లంతా బంగారంతో గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ గోల్డెన్ బాబా ఒంటిపైన ఏకంగా 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి మహా కుంభమేళాలో తిరుగుతున్నారు. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఒళ్లంతా బంగారం పెట్టుకొని తిరుగుతున్న ఈ బాబా పైన ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది.
కేరళ రాష్ట్రానికి చెందిన గోల్డెన్ బాబా
అసలు ఇంతకీ ఎవరు ఈ బాబా... ఏం చేస్తుంటాడు అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గోల్డెన్ బాబా అసలు పేరు మహామండలేశ్వర్ నారాయణా నంద్ గిరి మహరాజ్. నిరంజని అఖాడకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా ఆయన సేవలందిస్తున్నాడు. ఇక గోల్డెన్ బాబా తన శరీరం పైన ధరించిన వివిధ బంగారు ఆభరణాల గురించి వివరించాడు.
ఆభరణాల నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్న గోల్డెన్ బాబా
పగడాలు, రుద్రాక్షలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన నగల నుండి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన పేర్కొన్నా.రు వివిధ దేవతామూర్తులకు గుర్తుగా తాను 15 సంవత్సరాలుగా ఈ బంగారు ఆభరణాలను ధరిస్తున్నానని వీటి వల్ల తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన తెలిపారు. ఇక శ్రీ యంత్రంతోపాటు తాను వేసుకున్న నగలను కూడా పూజలలో ఉపయోగిస్తానని గోల్డెన్ బాబా తెలిపారు. మొత్తంగా ప్రస్తుతం మహా కుంభమేళాలో సందడి చేస్తున్న గోల్డెన్ బాబా ఒంటినిండా బంగారు నగలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు..












Click it and Unblock the Notifications