వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చట్టబద్దతకు కేంద్రం మొగ్గు

భారత్‌లో క్రీడల ప్రోత్సాహనికి నిధుల కొరత ఉండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకుగాను డ్రాఫ్ట్‌ను తయారుచేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారత్‌లో క్రీడల ప్రోత్సాహనికి నిధుల కొరత ఉండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకుగాను డ్రాఫ్ట్‌ను తయారుచేస్తోంది.

వచ్చే రేండేళ్ళలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే నిధులతగో క్రీడలను ప్రోత్సాహించాలనుకొంటుంది. ఇప్పటికే భారత్‌లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి 9.5 లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతోంది.

Sports Ministry lays ground for making online betting legal

దీంతో దీనిని చట్టబద్దం చేసే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు రానున్నాయని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి గుర్రపు పందెలు, చట్టబద్దంగా సాగుతున్నాయి. కేంద్రం దీనిపై వీటిపై 28 శాతం జిఎస్‌టి వసూలు చేస్తోంది.

ఇటీవల ఈ విషయమై కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్‌గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు. బెట్టింగ్ అనేది సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యని క్రీడా మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది.

మ్యాచ్‌ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడంతో ఆచితూచి ప్రణాళికను సిద్దం చేస్తున్నట్టు తెలిపింది.

గతంలో సుప్రీంకోర్టుకు క్రికెట్ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలని చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. లోథాకమిటీ కూడ తన నివేదికలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే యూకేలో ఇది అమలౌతోంది.

English summary
The Sports Ministry has begun the groundwork to frame a legislation to legalise online sports betting in India. According to a ministry official, informal consultations have already been held with various stakeholders in the government. However, it may take at least two years for the ministry to prepare a draft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X