వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసత్య వార్తలు, తప్పుడు కథనాలు: 22 యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్, వీటిలో 4 పాకిస్థాన్ దేశానివి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసత్య వార్తలు, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాలు, వీడియో ఫ్లాట్‌ఫాంలపై కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో భారతదేశానికి చెందిన 18 ఉండగా, మరో నాలుగు ఛానళ్లు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.

ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. అయితే, యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

spreading fake news: Govt bans 18 Indian and 4 Pakistan YouTube channels

వీక్షకులను తప్పుదారి పట్టించేందుకు ఈ ఛానెళ్లు.. టీవీ వార్తా ఛానెళ్ల లోగోలు, తప్పుడు సూక్ష్మచిత్రాలను ఉపయోగించాయని పేర్కొంది. అంతేగాక, 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ ఖాతా, ఒక వార్తా వెబ్‌సైట్ కూడా బ్లాక్ చేశారు. జమ్మూకాశ్మీర్ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానెళ్లు నకిలీ వార్తలను వ్యాప్తి చేశాయని, సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో ఐటి రూల్స్ 2021 నోటిఫికేషన్ తర్వాత భారతీయ యూట్యూబ్ ఛానెళ్లపై చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అని ప్రభుత్వం తెలిపింది.

గత కొన్నేళ్లుగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. డిసెంబర్ 2021 నుంచి, జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి 78 యూట్యూబ్ ఛానెళ్లు, అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తాజాగా హెచ్చరించింది.

తాజాగా బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల జాబితా:

ARP News

AOP News

LDC News

SarkariBabu

SS ZONE Hindi

Smart News

News23Hindi

Online Khabar

DP news

PKB News

KisanTak

Borana News

Sarkari News Update

Bharat Mausam

RJ ZONE 6

Exam Report

Digi Gurukul

These YouTube channels are based in India.

భారత్ నిషేధించిన పాకిస్థాన్ ఛానళ్లు ఇవే

DuniyaMeryAagy

Ghulam NabiMadni

HAQEEQAT TV

HAQEEQAT TV 2.0.

English summary
spreading fake news: Govt bans 18 Indian and 4 Pakistan YouTube channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X