ఆజారుద్దీన్ ఇంటికి కరెంట్, నీరు కట్ చేసిన అధికారులు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి.
అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు పంపించినా.. తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌డీఎంసీ అధికారి తెలిపారు. విద్యుత్, నీటి నిలిపవేత తర్వాత కొందరు ఖాళీ చేశారని ఐతే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి లోక సభ హౌసింగ్ కమిటీకి కూడా నివేదిక సమర్పించామని అన్నారు.

ఇలా గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్లమెంట్ సభ్యులు తమకు కేటాయించిన క్వార్టర్లను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారింది.
దీంతో సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఇళ్లు ఖాళీ చేయాలని లోక సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానం చెప్పనివారి ఇళ్లకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలివివేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications