వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది తెలుసా: తమిళనాడు ఎన్నికల్లో శ్రీదేవి గ్లామర్ ఇలా

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: అతిలోక సుందరి శ్రీదేవికి కొద్దిపాటి రాజకీయానుభవం కూడా ఉంది. సినీ రింగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో ఆమె రాజకీయ వ్యవహారం గురించి అందరూ మరిచిపోయారు.

శ్రీదేవి తండ్రి 1989 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన తరఫున శ్రీదేవి ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీ తరఫున శ్రీదేవి తండ్రి కె. అయ్యప్పన్ శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

 ఎంజీఆర్ మృతి తర్వాత తొలి ఎన్నికలు

ఎంజీఆర్ మృతి తర్వాత తొలి ఎన్నికలు

ఎంజీ రామచంద్రన్ మృతి తర్వాత తమిళనాడు శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు అవి. దాంతో ఎన్నికలు వాడిగా వేడిగా జరిగాయి. దాదాపు అన్ని నియోజవర్గాల్లో బహుముఖ పోటీ చేసింది. ప్రధానంగా నాలుగు పార్టీలు పోటీ చేశాయి.

ఆ నాలుగు పార్టీలు...

ఆ నాలుగు పార్టీలు...

డిఎంకె, కాంగ్రెసు పార్టీలతో పాటు అన్నాడియంకెకు చెందిన రెండు వర్గాలు పోటీ చేశాయి. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ వర్గంతో పాటు జయలలిత వర్గం వేర్వేరుగా పోటీ చేశాయి. ఆశ్చర్యకరంగా శివకాశి నియోజకవర్గంలో అయ్యప్పన్‌ను కాంగ్రెసు పోటీకి దించింది.

కాంగ్రెసు కుటుంబమే అయినప్పటికీ...

కాంగ్రెసు కుటుంబమే అయినప్పటికీ...

అయ్యప్పన్ కుటుంబం కాంగ్రెసు పార్టీకి చెందిందే. కానీ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయలేదు. ఆయనను అభ్యర్థిగా దించడం పట్ల కాంగ్రెసు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అప్పటి తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ముపనార్ కూడా ఆ విషయంపై మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో అయ్యప్పన్‌కు మంచి పేరు ఉంది. దాంతో రాజీవ్ గాంధీ ఆయన పేరును ఖరారు చేశారు.

 రాజీవ్ గాంధీతో అయ్యప్పన్ భేటీ...

రాజీవ్ గాంధీతో అయ్యప్పన్ భేటీ...

తమిళనాడుకు 1988లో తరుచుగా వస్తున్న తరుణంలోరాజీవ్ గాంధీని అయ్యప్పన్ కలుస్తూూ ఉండేవారు. 1989 ఎన్నికల్లో పలువురు సినీ స్టార్లు ఎన్నికల్లో కనిపించారు. పోటీ చేశారు కూడా. శ్రీదేవి కూడా తన గ్లామర్‌ను రాజకీయాల కోసం వాడారు.

 నిజానికి ఇలా అనుకున్నారు...

నిజానికి ఇలా అనుకున్నారు...

నిజానికి, శ్రీదేవినే పెద్ద యెత్తున ప్రచారానికి వాడుకోవాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుందని, అయితే కుళ్లు రాజకీయాలకు తాను దూరంగా ఉండదలుచుకున్నానని చెప్పి శివకాశి ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారని చెబుతుంటారు.

 అసలు శ్రీదేవి మాట్లాడలేదు...

అసలు శ్రీదేవి మాట్లాడలేదు...

శ్రీదేవి శివకాశి నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఏమీ మాట్లాడలేదు. మూడు నాలుగు రోజులు తన తండ్రి వెంట తిరిగి ముంబై వెళ్లిపోయారు. డిఎంకే నేత పి. శ్రీనివాసన్ చేతిలో అయ్యప్పన్ 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

English summary
Sridevi had a brief brush with politics, though it was almost forgotten in view of the her colossal success in the film world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X