Tirumala: భక్తులకు పంగనామాలు, దర్శనం టిక్కెట్ల బ్లాక్ మార్కెట్, దళారుల చీటి చంపేసిన టీటీడీ విజిలెన్స్ !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరిస్వామి భక్తుల మనోభావాలతో గేమ్స్ ఆడుతున్న వారి చీటీ చినిగిపోయింది. తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలపై టీటీడీ నిఘా మరియు భద్రాతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 41 మందిని అరెస్టు చేశారు. శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లుతో మోసం చేశారని, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించి అందరి మీద కేసులు నమోదు చేశారు. శ్రీవారి భక్తులు నకిలి వెబ్ సైట్లు చూసి మోసపోరాదని. దళారులను నమ్మిమోసపోరాదని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు.

శ్రీవారి దర్శనం టిక్కెట్లు
తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి, విదేశాలలోని హిందువులు ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకు వస్తుంటారు. సరైన సమయంలో శ్రీవారి దర్శనం కోసం టిక్కెట్లు అందని భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు దళారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

రెండు నెలల్లో 41 మంది అరెస్టు
తిరుమలలోని శ్రీవారి దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలపై టీటీడీ నిఘా మరియు భద్రాతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీస్ వారు రెండు నెలలలో వ్యవధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బ్లాక్ మార్కెట్ టిక్కెట్లతో ప్రమేయం ఉన్న 41 మందిని అరెస్టు చేశారు.

పొలిటికల్ లీడర్ల నకిలి లెటర్లు
జూలై, ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
భక్తులను మోసం చేయడానికి ప్రయత్నించారని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

తిరుపతి, తిరుమలలో కేసులు
భక్తులను మోసం చేసినందుకు, భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా నడుచుకున్న దళారులపై తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదులు నమోదు చేశారు.
భక్తులు దళారులను నమ్మొద్దని, దర్శనం కోసం నకిలీ వెబ్‌సైట్‌లు మరియు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించవద్దని టీటీడీ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది.
Recommended Video

టీటీడీ అధికారిక వెబ్ సైట్
టిటిడి అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.gov.in నుండి మాత్రమే ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ మరోసారి భక్తులకు విజ్ఞప్తి చేసింది. దళారులు, నకిలీ వెబ్‌సైట్ నిర్వహకులు, ట్రావెల్ ఏజెన్సీలపై నేరం రుజువైతే వారి మీద టీటీడీ చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని సమాచారం. మొత్తం మీద కోవిడ్ 19 మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి పరిమితి సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్న సమయంలో దళారులు చేతి వాటం చూపించడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
-
అలిపిరితో పాటు తిరుమలలో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications