ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు: షాపులు ఓపెన్: తెరచుకుంటున్న దుకాణాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్టాండ్ అలోన్ దుకాణాలు ఒక్కటొక్కటికిగా తెరచుకుంటున్నాయి. కొన్ని రకాల దుకాణాలను ఓపెన్ చేయడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదివారం ఉదయం చిరు వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభిచారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో కరోనా రహిత ప్రాంతాల్లో దుకాణదారులు రోజువారీ పనుల్లో నిమగ్నం అయ్యారు.

స్టాండ్ అలోన్ దుకాణాలకు మాత్రమే..

స్టాండ్ అలోన్ దుకాణాలకు మాత్రమే..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ పరిధిలోని అన్ని దుకాణాలు తెరచుకుంటున్నాయి. సింగిల్‌ బ్రాండ్‌, మల్టీ బ్రాండ్‌ల వస్తువులను విక్రయించే మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో ఉండే దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌ ప్రాంగణాల్లోనివి మినహా అన్ని దుకాణాలు తెరచి ఉంచవచ్చంటూ కేంద్రం ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇ-కామర్స్‌పై ఆంక్షలు యధాతథం

ఇ-కామర్స్‌పై ఆంక్షలు యధాతథం

ఇ-కామర్స్‌ కంపెనీలపై విధించిన ఆంక్షలను యధాతథంగా కొనసాగించింది కేంద్రం. నిత్యావసర సరుకులను విక్రయించడానికి మాత్రమే వాటికి ఇదివరకు అనుమతి ఇచ్చింది. దాన్నే యధాతథంగా కొనసాగిస్తోంది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది కేంద్రం. నిబంధనలకు అనుగుణంగా తెరిచే దుకాణాలు 50 శాతం సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించడానికే ఈ మేరకు ఆంక్షలను విధించింది. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి చేసింది.

మద్యం షాపులకు నో..

మద్యం షాపులకు నో..

మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. మద్యాన్ని పరిమితంగానైనా విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు చేసిన విజ్ఙప్తి పట్ల కేంద్రం స్పందించలేదు. మద్యం అమ్మకాలపై ఇదివరకు విధించిన నిషేధాజ్ఙలు ఇదివరకటిలాగానే కొనసాగుతున్నాయి. మద్యం విక్రయాలను ఆరంభిస్తే.. సోషల్ డిస్టెన్సింగ్‌కు విఘాతం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. దీనికితోడు- మద్యం మత్తులో మందుబాబులు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులవుతారని అనుమానిస్తోంది.

Recommended Video

    Watch Flights Parking at Delhi's Airport, Rare Video Must Watch
    జనం రద్దీని నివారించడానికి

    జనం రద్దీని నివారించడానికి

    మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపింగ్ మాల్స్ ను తెరచుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, జిమ్స్, సోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కు, థీమ్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలపై విధించిన నిషేధం ఈ నెల 3వ తేదీ వరకు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా రవాణా, వ్యక్తిగత ప్రైవేటు రవాణాను కూడా దీని కిందికి తీసుకొచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+