ద‌క్షిణ భార‌త తీరంపైపు రాకాసి అల‌లు దూసుకొస్తున్నాయి.. ఇన్‌కాయిస్ హెచ్చ‌రిక‌

వారం రోజుల కిందట దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మొదలైన రాకాసి అలలు క్ర‌మ‌క్రమంగా భారత తీరానికి దూసుకొస్తున్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. వీటి ప్ర‌భావంగా శ‌ని-ఆదివారం(మే 4,5 తేదీల్లో) మ‌ధ్య‌ గోవా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తీరంపై రాకాసి అల‌లు విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల‌ని హెచ్చరించింది. మ‌రీ ముఖ్యంగా లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు తీరంలో రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనున్న‌ట్లు ఇన్‌కాయిస్ అంచ‌నా వేస్తోంది.

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు

అలాగే, తీరంలోని లోతట్టు ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్ప‌టికే సూచ‌న‌లు చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అత్యవసర విభాగాలకు ఓ ప్ర‌క‌ట‌న‌లో ఇప్ప‌టికే సమాచారం అందించిన‌ట్లు వెల్ల‌డించింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తీర‌ప్రాంత‌పు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఈ రెండు మూడు రోజులూ వేట‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది.

Storm waves are hitting the coast of South India Incois warning

ఇన్‌కాయిస్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 'భారత్ తీరానికి 10 వేల కిలోమీటర్ల దూరంలోని దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏప్రిల్‌ 26న శక్తివంతమైన అలలు మొదలయ్యాయి. ఆ సమయం ఉవ్వెత్తున ఎగిసిపడి 60 సెకన్లపాటు గాలిలో నిలిచాయి. క్రమంగా అవి ఏప్రిల్‌ 28 నాటికి దక్షిణ హిందూ మహాసముద్రానికి చేరుకున్నాయి. వీటి తీవ్ర‌త‌ను పరిగ‌న‌లోకి తీసుకుని అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇన్‌కాయిస్ హెచ్చిరించింది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+