ఏటీఎంకు అంత్యక్రియలు!: డబ్బులు దొరకలేదన్న అసహనంతో..
కొచ్చి : దేశంలో నోట్ల తిప్పలు సామాన్యులను తీవ్ర అసహనానికి లోను చేస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా లాభం లేకపోవడంతో విచిత్రమైన పంథాలో తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు పలువురు.
ఢిల్లీలోని ఓ ఏటీఎం ఎదుట నిలుచున్న ఓ యువతి తీవ్ర అసహనంతో.. క్యూలోనే టాప్ లెస్ గా మారిపోయిన విచిత్ర సంఘటన మరిచిపోకముందే.. కేరళలో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా డబ్బు దొరక్కపోవడంతో.. విచిత్రమైన రీతిలో తమ నిరసనను వ్యక్తపరిచారు అక్కడి స్థానికులు.

చావు సందర్బంగా వినిపించే శోకాలను తలపించేలా.. ' ఇంత త్వరగా మమ్మల్ని వదిలిపోయినందుకు విచారిస్తున్నామని, ప్రస్తుతం మోడీ జపాన్ పర్యటనలో ఉన్నందునా... రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని' ఓ కాగితంలో పేర్కొంటూ దాన్ని ఏటీఎంకు అంటించారు. ఆపై ఏటీఎంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేరళ వాసులు చేసిన ఈ విచిత్రమైన నిరసన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications