Student: 12 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలో ?, చెప్పులతో కొట్టి ఏం చేశారంటే !
చెన్నై/ తిరువళ్లూరు: స్కూల్ లో చదువుతున్న అమ్మాయి స్కూల్ లేని సమయంలో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయం పనులకు సహకరిస్తోంది. స్కూల్ లేకపోవడంతో 7వ తరగతి అమ్మాయి పొలం దగ్గరకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసిన యువకుడు ఆమె మీద అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వెయ్యడంతో గ్రామస్తులు కామాంధుడిని పట్టుకుని చెప్పులతో కొట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
Wife: భర్త మాజీ సైనికుడు, వరుసకు తమ్ముడు ప్రియుడు, మద్యలో పొలిటికల్ లీడర్ ? !

పొలిటికల్ లీడర్ పొలాలు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తిణి సమీపంలోని ఆర్ కే పేటై ప్రాంతంలో మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు యోహోమలై నివాసం ఉంటున్నాడు. యోహోమలైకు చెందిన భూములను లీజుకుకు తీసుకున్న ఆ పరిసర ప్రాంతాల గ్రామస్తులు వ్యవసాయం చేస్తున్నారు.

7వ తరగతి అమ్మాయి
చాలా మంది రైతులకు యోహోమలై భూములు లీజుకు ఇచ్చాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. స్కూల్ లో చదువుతున్న అమ్మాయి స్కూల్ లేని సమయంలో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయం పనులకు సహకరిస్తోంది. స్కూల్ లేకపోవడంతో 7వ తరగతి అమ్మాయి పొలం దగ్గరకు వెళ్లింది.

చెప్పులతో కొట్టిన గ్రామస్తులు
తల్లిదండ్రులు వేరుశనగ చెట్లు పీకుతున్న సమయంలో బాలిక సమీపంలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లింది. ఆ సందర్బంలో పంచాతురం అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని అటవి ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఆమె మీద అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించాడు, బాలిక కేకలు వెయ్యడంతో గ్రామస్తులు పంచాతురంను పట్టుకుని చెప్పులతో కొట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్యపరీక్షలకు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.