జవాబుపత్రాల్లో పాటలు, బూతులు, 2 ఏళ్ళు సస్పెన్షన్, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కతా: పరీక్షల్లో సినిమా స్టోరీలు రాస్తే మార్కులు బాగా వేశారు. పాటలు రాసినా పాసయ్యాను. ప్రశ్ననే తిప్పి తిప్పి రాసినా మార్కులు వేశారు అని చెప్పడం మనం ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. ఈ తరహా ఘటనలు జరిగాయో లేదో తెలియదు . కాని, ఈ తరహా పరీక్షలు రాసినా తాము పాసయ్యామని గొప్పలు చెప్పుకొనే వారిని చూసే ఉంటాం.అయితే ఇదే తరహాలో జవాబులు రాసిన విద్యార్థులకు చుక్కలు చూపించారు బెంగాల్ అధ్యాపకులు. ఈ తరహా జవాబులు రాసిన విద్యార్థులపై రెండేళ్ళపాటు సస్పెన్షన్ వేటేశారు.

సెమిస్టర్ పరీక్షల్లో సమాధానాలకు బదులుగా పాటలు, కవితలు, బూతులు రాసిన పదిమంది విద్యార్థులపై రెండేళ్ళపాటు సస్పెన్షన్ వేటు పడింది.పశ్చిమబెంగాల్ లోని మాల్దాలోని బల్గర్ ఘాట్ లా కాలేజీకి చెందిన విద్యార్థులపై విద్యాశాఖ రెండేళ్ళపాటు సస్పెన్షన్ వేటేసింది.

exams

గత ఏడాది మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు పదిమంది తప్పుడు పద్దతిని అనుసరించారు. జవాబుపత్రాల్లో దూషణలు, హిందీ, బెంగాలీ సినిమాల్లోని పాటలు, ప్రేమ గురించిన అంశాలు రాశారు.

ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజనిర్థారణ కమిటీ వీటిని గుర్తించడంతో సదరు విద్యార్థులపై రెండేళ్ళపాటు సస్నెన్షన్ వేటేసాింది బెంగాల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడిషనల్ ఛార్జ్ సనాతన్ దాస్ తెలిపారు.

గత ఏడాది జరిగిన ఈ పరీక్షల్లో 150 మంది పరీక్షలు రాశారు. 40 మంది మాత్రమే పాసయ్యారు.దీంతో తమను పాస్ చేయలేదని సదరు విద్యార్థులు విధ్వంసానికి దిగారు. తప్పుడు జవాబులు రాయడమే కాకుండా అభ్యంతరకరంగా వ్యవహరించడంతో వారిపై రెండేళ్ళపాటు సస్పెన్షన్ వేటు విధించాలని కఠిన నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 10 students were suspended for writing poems, songs and abuses in their semester exams in West Bengal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి