డిస్మిస్ చేయాలి: స్వామి, చెప్పినంత సులువు కాదు: కేజ్రీవాల్‌కు హజారే

ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలకు తమకు ఈ గెలుపు అందించారన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలకు తమకు ఈ గెలుపు అందించారన్నారు.

పార్టీ విజయానికి కృషిచేసిన నాయకులను ప్రశంసిస్తూ మోడీ ట్వీట్‌ చేశారు.ఢిల్లీలోని మొత్తం 270 వార్డులకు ఎన్నికలు జరగగా ఫలితాల్లో బీజేపీ దూకుడుగా ప్రదర్శించింది. మూడు మున్సిపాలిటీలలోను మేజిక్ ఫిగరా దాటింది.

కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి: సుబ్రహ్మణ్య స్వామి

కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రజల మద్దతును ఏఏపీ ప్రభుత్వం కోల్పోయిందని విమర్శించారు.

 Subramanian Swamy seeks dismissal of Delhi government

చెప్పినంత సులువు కాదు: అన్నా హజారే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అన్నాహజారే చురకలు అంటించారు. చెప్పడానికి, చేయడానికి చాలా తేడా ఉంటుందని విమర్శించారు. చెప్పడంతోనే సరిపోదని, చేయాలని అభిప్రాయపడ్డారు.

ఏఏపీపై ఆ పార్టీ మాజీ నేత, స్వరాజ్‌ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్‌ విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజలు తమ తీవ్ర అసంతృప్తిని ఈ ఎన్నికల ద్వారా తెలియజేశారన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని తాను ముందే ఊహించానన్నారు.ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తిరస్కరించారని, ప్రధాని మోడీని గెలిపించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+