సునందా పుష్కర్ కేసులో.. సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు ఝలక్!
కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ భార్య సునందా పుష్కర్ మరణంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. సునందా మృతి కేసులో విచారణ చేపట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ భార్య సునందా పుష్కర్ మరణంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. సునందా మృతి కేసులో విచారణ చేపట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన అభ్యర్థన పిటిషన్.. ఓ రాజకీయ ప్రయోజన వాజ్యంలా ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. సునంద హత్య కేసులో బీజేపీ ఎంపీ తన దగ్గర ఉన్న సమాచారాన్ని దాచి పెట్టారని కోర్టు పేర్కొంది.

మిస్టరీగా మారిన సునందా మృతి కేసులో ముందుగా సమర్పించాల్సిన అంశాలను సుబ్రమణ్యస్వామి రహస్యంగా ఉంచారని కోర్టు వెల్లడించింది. సునంద మృతి కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ థరూర్ జోక్యం చేసుకున్నారని స్వామి చేసిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు విభేదించారు.












Click it and Unblock the Notifications