సునంద పుష్కర్ కేసు: వాటి ఆధారంగా... శశిథరూర్‌కు సిట్ 20 ప్రశ్నలు!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మరోసారి ప్రశ్నించింది. గురువారం ఉదయం ఆయనను సిట్ ప్రశ్నించింది. గడిచిన రెండు వారాల్లో థరూర్‌ను రెండోసారి విచారించింది.
డీసీపీ ఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర సింగ్ ఈ విచారణలో పాల్గొన్నారు. మొదటిసారి శశిథరూర్ విచారణలో చెప్పిన విషయాలను, ఇటీవల పలు సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ బృందం ఫ్రెష్ క్వశ్చనీర్‌ను తయారు చేసుకుంది.

సిట్ శశిథరూర్‌ను కొత్తగా మరో ఇరవై ప్రశ్నలు అడుగుతోందని సమాచారం. శశిథరూర్ సరోజినీ నగర్ పోలీసు స్టేషన్‌కు ఉదయం పదిన్నరకు వచ్చారు. అతను న్యాయవాదితో కలిసి కారులో వచ్చారు. సరోజినగర్ పోలీసు స్టేషన్ నుండి అతనిని సిట్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడ పదకొండున్నరకు విచారణ ప్రారంభించారు. కాగా, శశిథరూర్ ఇంట్లో పని చేసిన నారాయణ సింగ్, బజరంగ్‌లను మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications