Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహాయుతి బిగ్ గేమ్ ప్లాన్.. శరద్ పవార్ ఆశలపై నీళ్లు?

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహా రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషాదం నుంచి తేరుకోకుముందే అధికార మహాయుతి కూటమి ఓ భారీ రాజకీయ ఎత్తుగడ వేసింది. శనివారం సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు శరద్ పవార్ శిబిరాన్ని తీవ్ర ఆందోళనలో పడేశాయి.

శరద్ పవార్ ఆశలపై మహాయుతి నీళ్లు!
అజిత్ పవార్ మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు (శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు) మళ్లీ ఒకటి అవుతాయని అంతా భావించారు. స్వయంగా శరద్ పవార్ కూడా.. గత 4 నెలలుగా పార్టీల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 12న దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ నియంత్రణ మళ్లీ శరద్ పవార్ చేతుల్లోకి వెళ్లకుండా మహాయుతి కూటమి అత్యంత వేగంగా పావులు కదిపింది.

sunetra pawar as Maharashtra Deputy CM MahaYuti Strategy to Counter Sharad Pawar Full Details

సునేత్రా పవార్‌ను ఎంచుకోవడం వెనుక 'రాజకీయ లెక్కలు'ఇవే..

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా, అజిత్ పవార్ వర్గం స్వతంత్రంగానే ఉంటుందని, శరద్ పవార్ నాయకత్వంలోకి వెళ్లబోదని మహాయుతి స్పష్టం చేసింది. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలు తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకే సునేత్రా పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని, ఆమెను డిప్యూటీ సీఎంగా నామినేట్ చేయాలని నిర్ణయించారు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలంటే.. ఆ కుటుంబానికి కీలక పదవి ఇవ్వడం ఒక్కటే మార్గమని దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని కూటమి భావించింది.

శనివారం ఏం జరగనుంది?
శనివారం జరగనున్న ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో సునేత్రా పవార్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ సమర్పించి, సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వ్యూహంతో అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్యకే అప్పగించినట్లయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+