రాజకీయాల్లోకి రజనీకాంత్: క్లారిటీ ఇచ్చేసిన ఆప్తమిత్రుడు, రాజ్ మాట అంటే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/బెంగళూరు: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడులోని ఏడు కోట్ల మంది జనాభా కోరిక తీరుతుందని ఆయన ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అభిమానులు, తమిళనాడు ప్రజల అభిప్రాయాలకు రజనీకాంత్ కచ్చితంగా విలువ ఇస్తారని బెంగళూరులో రాజ్ బహదూర్ మీడియాకు చెప్పారు.

దేవుడు ఆదేశిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల రజనీకాంత్ ప్రకటించారు. రజనీకాంత్ ఆధ్యాత్మిక గురువు బాలజీ మంచి మార్గం చూపుతారు. కచ్చితంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన ప్రాణమిత్రుడు రాజ్ బహదూర్ స్పష్టం చేశారు.

రాజ్ బహదూర్ మాట అంటే వేదం

రాజ్ బహదూర్ మాట అంటే వేదం

1970లో బెంగళూరు నగర ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కర్ణాటక రవాణా శాఖ) సిటి బస్సు లో రాజ్ బహదూర్ డ్రైవర్ గా, రజనీకాంత్ కండెక్టర్ గా పని చేశారు. వీరు మెజస్టిక్-శ్రీనగర్ రూట్ నెంబర్ 10 (అప్పట్లో) లో విధులు నిర్వహించే వారు. అప్పటి నుంచి రజనీకాంత్ కు రాజ్ బహదూర్ ఆప్తమిత్రుడు. ఆయన మాట అంటే రజనీకాంత్ కు వేదం.

రజనీకాంత్ ఈ స్థాయిలో ఉన్నారంటే !

రజనీకాంత్ ఈ స్థాయిలో ఉన్నారంటే !

రజనీకాంత్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ ఆ రోజు ఆర్థిక సహాయం చేసి రజనీకాంత్ ను చెన్నై (మద్రాసు)కు పంపించకుంటే రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయ్యేవారు కాదు. రజనీకాంత్ కు సినిమాల మీద ఉన్న ఆసక్తి గమనించి ఆయన్ను ప్రోత్సహించింది రాజ్ బహదూర్ ఒక్కరే.

రజనీకాంత్ కు జీతం పంపించి

రజనీకాంత్ కు జీతం పంపించి

రజనీకాంత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు చేరుకుని అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరారు. బెంగళూరులో డ్రైవర్ గా పని చేస్తున్న రాజ్ బహదూర్ తన కుటుంబానికి ఎంత డబ్బు కేటాయించారో అంతే డబ్బు రజనీకాంత్ కు పంపించి ఆదుకున్నారు.

ఈనెల 8వ తేది బెంగళూరులో రజనీ

ఈనెల 8వ తేది బెంగళూరులో రజనీ

2017 మే 8వ తేది బెంగళూరులో జరిగిన ఓ వివాహానికి రజనీకాంత్ హాజరయ్యారు. ఆ సమయంలో రజనీకాంత్ చాల టెన్షన్ తో ఉండటం గమనించానని రాజ్ బహదూర్ అన్నారు. రజనీ అలా టెన్షన్ కు గురికావడం తాను ఎప్పుడూ చూడలేదని రాజ్ బహదూర్ అన్నారు.

జయలలిత తరువాత ఎవరు దిక్కు

జయలలిత తరువాత ఎవరు దిక్కు

తాను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని రజనీకాంత్ టెన్షన్ కు గురైనారని రాజ్ బహదూర్ అన్నారు. జయలలిత మరణం తరువాత తమిళనాడు ప్రజలను సరైన మార్గంలో నడిపేవారు ఎవరు అని రజనీకాంత్ ఆవేదన చెందారని రాజ్ బహదూర్ చెప్పారు.

అభిమానులు, ప్రజలు ఒత్తిడితో

అభిమానులు, ప్రజలు ఒత్తిడితో

అభిమానులు, తమిళనాడు ప్రజలు ఒత్తిడితో రజనీకాంత్ ను ఆలోచింపజేసిందని రాజ్ బహదూర్ అంటున్నారు. ఏదో ఒక పార్టీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టాలని తాను అభిప్రాయపడుతున్నానని, ఎక్కువ శాతం అభిమానులు, ప్రజలు అదే కోరుకుంటున్నారని రాజ్ బహదూర్ అన్నారు.

క్లారిటీ ఇచ్చిన రాజ్ బహదూర్

క్లారిటీ ఇచ్చిన రాజ్ బహదూర్

రజనీకాంత్ మాటల్లోని అంతరార్థం గమినిస్తే ఏడు కోట్ల మంది తమిళులను ఆయన నిరాశపర్చరని భావిస్తున్నానని రాజ్ బహదూర్ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం కచ్చితంగా జరుగుతోందని రాజ్ బహదూర్ అంటున్నారు.

బెంగళూరులో అందర్ని కలిసిన రజనీ

బెంగళూరులో అందర్ని కలిసిన రజనీ

మే 8వ తేది బెంగళూరులో జరిగిన పెళ్లి వేడుక తరువాత రజనీకాంత్ తన పాత స్నేహితులు అందర్నీ కలిసి రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అంటూ 12 గంటలు వారితో చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారని తెలిసింది. స్నేహితుల అభిప్రాయాలు తెలుసుకున్న రజనీ ఇప్పుడు అభిమానులతో సమావేశం కావడంతో ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది.

ఆప్తమిత్రులది ఒకే మాట !

ఆప్తమిత్రులది ఒకే మాట !

రజనీకాంత్, రాజ్ బహదూర్ ప్రాణస్నేహితులు. తనకు సినీ జీవితాన్ని ప్రసాధించడంలో ప్రధాన సూత్రధారుడైన రాజ్ బహదూర్ మాటే తన మాట అని రజనీకాంత్ అంటుంటారు. రాజ్ బహదూర్ సహాయం మరువని రజనీకాంత్ వల్లి అనే చిత్రంలో రాజ్ బహదూర్ ను నటింపచజేసి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభం అయిన వీరి స్నేహం నేటికి అదే స్థాయిలో కొనసాగుతోంది.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడులోని ఏడు కోట్ల మంది జనాభా కోరిక తీరుతుందని ఆయన ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల 8వ తేదీన బెంగళూరులో రజనీకాంత్ తన ప్రాణ స్నేహితులతో రాజకీయాల్లోకి రావాల, వద్దా అంటూ 12 గంటలు చర్చించి నిర్ణయం తీసుకున్నారని రాజ్ బహదూర్ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Raj Bahadur has said that when Rajiniknath was in Bengaluru last time he discussed about politics close to 12 hours. He further added that there is a turmoil Tamil Nadu politics after the demise of Tamil Nadu Chief Minister Jayalalithaa. He will take right time decision at the right time in the interests of Tamil Nadu people.
Please Wait while comments are loading...