మాల్యాకు మరో దెబ్బ: సుప్రీం ఆగ్రహాం, నోటీసుల జారీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత, మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడంతో ఆగ్రహించిన సుప్రీం కోర్టు మాల్యాకు కఠినమైన ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది.

విచారణ మరోసారి వాయిదా: శిక్ష నుంచి తప్పించుకున్న విజయ్ మాల్యా!

ఆస్తుల వివరాల వెల్లడిపై బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఏప్రిల్ చివరి నాటికి మాల్యా పూర్తి ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది.

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

దీనికి అంగీకరించిన మాల్యా తన ఆస్తుల వివరాలను మాత్రం వెల్లండించలేదు. దీంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను మాల్యాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన కోర్టు తాజాగా సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేత కేసులో విచారణకు బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)కి కోర్టు మరింత గడువుని మంజారు చేసింది.

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరేజ్ హోల్డింగ్ లిమిటెడ్ ఆస్తుల వ్యవహారంలో కంపెనీ సమర్పించిన 2000 పేజీల పత్రాల పరిశీలనకు గడువు కావాలని బ్యాంకుల కౌన్సిల్ కోరింది. అయితే మాల్యా సమర్పించిన ఈ పత్రాల్లో అంత ముఖ్యమైన సాక్ష్యాలు ఏమీలేవని పేర్కొంది.

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

అంతేకాదు విచారణ సమయాన్ని పొడిగించడానికి చేసిన ప్రయత్నంగా దీనిని ఆరోపించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన 9వేల కోట్ల బకాయిలు పడిన మాల్యాకు డియోజియో చెల్లింపులను నిలిపివేయాలని కోరుతూ ఎస్‌బీఐ కాన్సార్షియం డీఆర్‌టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేసిన సుప్రీం

ఈ నేపథ్యంలో ఆ చెల్లింపులను నిలిపివేయాలని డీఆర్‌టీని ఇటీవల ఆదేశించింది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పటికే కొంత మొత్తాన్ని విజయ్ మాల్యాకు చెల్లించినట్టు డియోజియో ఒక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Monday issued notices to liquor baron Vijay Mallya over a contempt petition alleging that he had failed to disclose his assets.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి