చైల్డ్ పోర్నోగ్రఫీ పదమే వాడొద్దు-చూసినా, స్టోర్ చేసినా నేరమే-సుప్రీం కీలక తీర్పు..!
పిల్లల లైంగిక వీడియోలు చూడటం, నిల్వ చేయటంపై మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ (పిల్లల లైంగిక వీడియోలు) పోక్సో చట్టం కింద శిక్షించిన దగిన నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అంతే కాదు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడొద్దని కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తమిళనాడులో ఓ 28 ఏళ్ల వ్యక్తి పిల్లల లైంగిక వీడియోల్ని డౌన్ లోడ్ చేసుకుని చూశాడన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. ఈ సందర్భంగా అతనిపై క్రిమినల్ చర్యల్ని నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది. అతను వీడియోల్ని కేవలం డౌన్ లోడ్ చేసుకుని చూసాడని, ఎవరికీ పంపలేదని, కాబట్టి పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఇలాంటి వీడియోలు చూడటం నేరం కాదని జడ్జి ఆనంద్ వెంకటేష్ సంచలన తీర్పు ఇచ్చారు. దీనిపై పలు స్వచ్చంద సంస్ధలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి.

వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ పోర్నోగ్రపీ నేరమంటూ గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించింది. మద్రాస్ హైకోర్టు నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేయడంతో పాటు అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు అతనిపై పోక్సో, ఐటీ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా తేల్చిచెప్పేసింది.












Click it and Unblock the Notifications