ప్యాంటు నాడా లాగడం అత్యాచార ప్రయత్నమే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
లైంగిక నేరాల కేసుల్లో న్యాయవ్యవస్థ సున్నితంగా వ్యవహరించాల్సిన అవసంరం ఉందని స్పష్టం చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వులను కొట్టివేస్తూ.. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?
గతంలో అలహాబాద్ హైకోర్టు ఓ లైంగిక వేధింపుల కేసును విచారిస్తూ అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. నిందితుడు మహిళపై భౌతిక దాడికి దిగడం, ఆమె ప్రైవేట్ భాగాలను తాకడం లేదా ప్యాంటు నాడా లాగడం వంటి ప్రయత్నాలు చేయడం అత్యాచారం కిందకు రాదని.. అది కేవలం అత్యాచారానికి జరిగిన ప్రయత్నం మాత్రమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు బాధితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో ఆ అంశాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు అన్వయించిన క్రిమినల్ లా సిద్ధాంతాలు పూర్తిగా తప్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళా బాధితురాలి ప్రైవేట్ భాగాలను తాకడం లేదా ఆమె దుస్తులను తొలగించడానికి ప్రయత్నించడం అనేది నేరం చేయడానికి సిద్ధపడటం కాదు.. అది నేరుగా నేరానికి పాల్పడటమేనని తేల్చి చెప్పింది. చట్టపరమైన నిర్వచనాలను ఇంత సంకుచితంగా చూడటం సరికాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

న్యాయప్రక్రియలో సున్నితత్వం లోపం
క్షేత్రస్థాయిలో లైంగిక నేరాల విచారణ సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు బాధితుల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు ఇచ్చేటప్పుడు వాడే భాష బాధితులను మరింత క్షోభకు గురిచేసేలా ఉండకూడదని, వారి గౌరవానికి భంగం కలగకుండా ఉండాలని న్యాయస్థానం కోరింది. న్యాయస్థానాలు బాధితుల పక్షాన నిలబడి భరోసా ఇవ్వాలే తప్ప.. సాంకేతిక కారణాలతో నేరగాళ్లకు ఊరటనిచ్చేలా ఉండకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
కొత్త మార్గదర్శకాల రూపకల్పన
ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా భోపాల్‌లోని నేషనల్ జుడీషియల్ అకాడమీ (NJA) ఆధ్వర్యంలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ గత తీర్పులను సమీక్షించి, లైంగిక నేరాల కేసుల్లో జడ్జీలు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పదజాలం వాడాలనే అంశాలపై పక్కా మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో బాధితుల పట్ల ఉపయోగించే అభ్యంతరకర పదాలను తొలగించి, వారి వేదనను గౌరవప్రదంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
సామాజిక భద్రతకు భరోసా
సమాజంలో బలహీన వర్గాలైన మహిళలు, పిల్లల రక్షణే చట్టం ప్రాథమిక బాధ్యత అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ తీర్పు కేవలం ఒక కేసుకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్ కోర్టుల పనితీరులో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. బాధితులు నిర్భయంగా న్యాయస్థానాలను ఆశ్రయించేలా, న్యాయం పొందేలా ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications