Arvind Kejriwal: ఎన్నికలకు ముందు కేజ్రివాల్ అరెస్టు ఎందుకు ? ఈడీకి సుప్రీం ప్రశ్న..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేజ్రివాల్ ను అరెస్టు చేసిన ఈడీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. కేజ్రివాల్ ను సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దీనికి ఈడీ వద్ద తక్షణ సమాధానం లేదు. దీంతో మే 3న జరిగే తదుపరి విచారణలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఎన్నికల వేళ తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లిక్కర్ కేసులో జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లేకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవచ్చా లేదా అనే ప్రశ్న ఈడీ అరెస్టుతో తలెత్తుతోందని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇదే బెంచ్ లో మరో న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ఈడీ కేజ్రివాల్ ను అరెస్టు చేసిన సమయంపై ప్రశ్నిస్తూ.. జీవితం, స్వేచ్ఛ అనేవి అంతకంటే ముఖ్యమన్నారు.

ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి అటాచ్ మెంట్ చర్యలు కూడా తీసుకోలేదని, అలా చేసి ఉంటే కేజ్రివాల్ పాత్ర ఏముందో చెప్పాలని జస్టిస్ దీపాంకర్ దత్తా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం సిసోడియా విషయంలో ఆధారాలు ఇచ్చిన ఈడీ.. కేజ్రివాల్ విషయంలో అలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభానికి, అరెస్టుకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించాలని ఈడీని ఆదేశించింది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications