అన్ని హద్దులూ దాటేశారు..! ఇక చాలు..! ఈడీ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్..!
రాష్ట్రాల్లో అధికారంలో ప్రాంతీయ పార్టీల్ని, విపక్షాల్ని టార్గెట్ చేస్తూ కేంద్రానికి కొమ్ము కాస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంటా్ డైరెక్టరేట్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమకు సంబంధం లేకపోయినా ప్రతీ అంశంలో కేంద్రం చెప్పినట్లుగా వింటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఈడీకి ఇవాళ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈడీ అన్ని హద్దులూ దాటేస్తుందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు మద్యం కుంభకోణంపై దర్యాప్తు పేరుతో రాష్ట్ర మద్యం పంపిణీ సంస్థ టాస్మాక్ ను టార్గెట్ చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీంకోర్టు ఇవాళ షాకిచ్చింది. మద్యం కుంభకోణం జరిగితే వ్యక్తుల్ని అరెస్టు చేసి విచారించాల్సింది పోయి సంస్థలపై కేసులు పెట్టి వేధించడం ఏంటని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈడీ తీరు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతే కాదు తమిళనాడు మద్యం స్కాంపై దర్యాప్తును నిలిపేస్తూ స్టే ఉత్తర్వులిచ్చింది.

మద్యం రవాణాలో అవినీతి, బార్ లైసెన్స్‌ల మంజూరు, బాటిల్ తయారీ సంస్థలు, డిస్టిలరీలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేయడం ద్వారా వచ్చిన లెక్కల్లో చూపని నగదు వంటి ఆరోపణలపై ఈడీ తమిళనాడులోని టాస్మాక్ లో తనిఖీలు చేస్తోంది. వీటిని సవాల్ చేస్తూ టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన జస్టిస్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈడీకి చీవాట్లు పెట్టింది.
వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు కానీ కార్పొరేషన్లపైనా? మీ ప్రతాపం అని ప్రశ్నించింది. ఈడీ అన్ని పరిమితులను దాటుతోందని వ్యాఖ్యానించింది. వేసవి సెలవుల తర్వాత ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని, అప్పటివరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని తమిళనాడులో అధికార డీఎంకే స్వాగతించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ ప్రయత్నాలకు తగిలిన దెబ్బగా దీన్ని అభివర్ణించింది.












Click it and Unblock the Notifications