Eknath Shinde: సుప్రీంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు షాక్..ఉద్ధవ్ థాక్రేకు రిలీఫ్..!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన అన్ని పార్టీ ఆస్తులు తను నాయకత్వం వహిస్తున్న వర్గానికి బదిలీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.ఈ పిటిషన్‌ను ముంబైకి చెందిన లాయర్ ఆశిష్ గిరి దాఖలు చేశారు.
శివసేప పార్టీ నిధులను, చర స్థిరాస్తులను ఉద్ధవ్ థాక్రే వర్గం ఎక్కడికీ బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లాయర్ ఆశిష్ గిరి పిటిషన్ దాఖలు చేశారు.అంతేకాదు ఏక్‌నాథ్ షిండే వర్గానికి వాటిని బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్టీ కొత్త అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే కాబట్టి ఆ వర్గానికి స్థిరచరాస్తులు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఉద్ధవ్ థాక్రే వర్గం తరపున వాదించిన అడ్వకేట్.. నిధులు, ఆస్తులు పార్టీ కార్యకర్తలు,నేతలు విరాళంగా ఇచ్చారని, వీటిపై ఎవరికీ ఎలాంటి అహక్కు లేదని వాదించారు. పార్టీ రెండుగా లేదా అంతకంటే ఎక్కువగా చీలిపోయినప్పటికీ కూడా ఈ అధికారం ఎవరికీ ఉండదని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు.
అంతకుముందు పార్టీ పేరు శివసేన, పార్టీ గుర్తు ధనుస్సు బాణం ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ చర్య తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు ఉద్ధవ్ థాక్రే క్యాంప్‌లో ఒకరకమైన భయాన్ని కలగజేసింది. ఇదిలానే సాగితే శివసేన భవన్, స్థానిక పార్టీ కార్యాలయాలు,పార్టీ నిధులను కూడా షిండే వర్గానికి బదిలీ అవుతాయోమో అనే ఆందోళన వ్యక్తం చేసింది.
అంతకుముందు ఈ నెల తొలివారంలో మాట్లాడిన ఏక్‌నాథ్ షిండే... లాయర్ వేసిన పిటిషన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అదే సమయంలో ఉద్దవ్ థాక్రే వర్గానికి చెందిన స్థిరచరాస్తులన్నీ తాను నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీకి బదిలీ కావాలని చెప్పారు. ఎన్నికల సంఘం శివసేన పార్టీపై సర్వాధికారాలు ఏక్‌నాథ్ షిండేకు ఉన్నాయని స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ నిధులు స్థిరచరాస్తులపై షిండే నేతృత్వం వహిస్తున్న శివసేనకే దక్కుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications