ఆ కీలక అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్..!!
శివసేన ఎన్నికల గుర్తింపు, ఉద్ధవ్ థాకరే-ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో అధికారంలో ఉన్న శివసేన-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గం దాఖలు చేసిన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవ్వాళ తన విచారణను ముగించింది.
శివసేన పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తును తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లు ఇవి. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తూ కొద్దిరోజుల కిందట కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివసేన రూపొందించుకున్న నిబంధనలు, ఆ పార్టీ అమలు చేస్తోన్న అంతర్గత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల కమిషన్ వ్యాఖ్యానించింది అప్పట్లో.

పార్టీ అంతర్గతంగా ఎలాంటి ఎన్నికలను కూడా శివసేన నిర్వహించలేదని, అలాంటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం రూపొందించుకున్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలేవీ పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంది. ఎన్నికల గుర్తు కేటాయింపు వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నప్పటికీ- ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనిపై ఉద్ధవ్ థాకరే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటీషన్లు దాఖలు చేసింది.
దీనితో పాటు స్పీకర్ తొలగింపు, కొత్త సభాపక్ష నేత ఎంపిక, ఆర్టికల్ 226, 32 ఉల్లంఘన, సభ్యులపై అనర్హత వేటు, పదవ షెడ్యూల్ పొందుపరిచిన అంశాలు.. ఇలా వాటన్నింటినీ విచారించడానికి అయిదు మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది.
మహారాష్ట్ర గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఉద్ధవ్ థాకరే తరఫున సీనియర్ అడ్వొకేట్స్ కపిల్ సిబల్, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. ఏక్ నాథ్ షిండే తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్, హరీశ్ సాల్వే, మహేశ్ జెఠ్మలానీ, మణీందర్ సింగ్ వాదించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications