Fali S Nariman: న్యాయకోవిదుడు, దిగ్గజ లాయర్ ఫాలీ నారిమన్ కన్నుమూత..!
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్ నారిమన్ ఇవాళ కన్నుమూశారు. సుప్రీంకోర్టులో ఎన్నో చారిత్రక కేసుల్లో తన వాదనలతో ఎన్నో కీలక తీర్పులు రావడానికి కృషి చేసిన నారిమన్ 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
దీంతో న్యాయవర్గాలు విషాదంలో మునిగిపోయాయి. నారిమన్ తన సుదీర్ఘ కెరీర్ లో దేశ చరిత్ర గతిని మలుపుతిప్పే పలు కేసుల్లో తన వాదనా పటిమతో మెప్పించారు. న్యాయ కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఫాలీ నారిమన్ మృతిపై సుప్రీంకోర్టులో ఆయన సహచర సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంతాపం ప్రకటించారు. చాలా విచారకరమైన వార్త అని, ప్రముఖ న్యాయనిపుణుడు ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూశారని ఎక్స్ లో వెల్లడించారు. ఆయన లాయర్ల సంఘానికి భీష్మ పితామహుడి వంటి వారన్నారు. తమ కుటుంబానికి గొప్ప న్యాయవాది , సన్నిహిత స్నేహితుడన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన మరణించడం మన దేశానికి తీరని లోటన్నారు.
Very sad news. Eminent Jurist Fali S Nariman Passes Away. He was also regarded as the Bhishma Pitamah of the Lawyer community. A great lawyer & close friend of our family. His passing away at this critical juncture is an enormous loss for our country https://t.co/VsTCFTSCNK
— Prashant Bhushan (@pbhushan1) February 21, 2024
సుప్రీంకోర్టులో రాజ్యాంగ కేసుల నిపుణుడిగా పేరు తెచ్చుకున్న ఫాలీ ఎస్ నారిమన్.. న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) కేసు, కొలీజియం ఏర్పాటుకు కారమైన ఏవోఆర్ కేసు సహా పలు కీలక పిటిషన్లలో వాదించారు. అలాగే పలు పౌర హక్కులు, లౌకిక వాద కేసులనూ వాదించిన చరిత్ర ఆయనకు ఉంది. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా తన అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా కూడా చేశారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపైనా నారిమన్ తీవ్ర విమర్శలు చేశారు. నారిమన్ కుమారుడు రోహింటన్ నారిమన్ సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా. నారిమన్ ఆత్మకథ "బిఫోర్ మెమరీ ఫేడ్స్" న్యాయ విద్యార్ధులందరికీ కరదీపిక. ముఖ్యంగా న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులలో ఇది ఎంతో ప్రేరణ నింపిందని చెప్పుకుంటారు. "ది స్టేట్ ఆఫ్ నేషన్", "గాడ్ సేవ్ ది హానబుల్ సుప్రీం కోర్ట్" వంటి పుస్తకాలను కూడా ఆయన రాశారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications