Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీంకోర్టు సీరియస్- సుమోటోగా స్వీకరణ

న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందంటూ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో ప్రచురించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం అసాధారణమని చెబుతుంటారు. అలాంటిది- ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణ చేపట్టడం అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను కించపరచడానికి భూమిపై ఎవరికీ అధికారం లేదని, అలా జరగడానికి తాను ఎంతమాత్రం అనుమతించబోనని తేల్చి చెప్పారు. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దేశ న్యాయవ్యవస్థలోని అవినీతి, భారీగా కేసులు/పిటీషన్లు పేరుకుపోయాయని ఈ పాఠ్యపుస్తకంలో ప్రచురితమైంది. న్యాయమూర్తుల కొరత వంటి సవాళ్లు న్యాయవ్యవస్థ ముందు ఉన్నాయని వెల్లడించింది.

Supreme Court Takes Suo Motu Action Over NCERT Class 8 Book Allegedly Defaming Judiciary CJI Responds

'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే సవరించిన అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దేశంలో కోర్టుల పనితీరు, వాటి నిర్మాణం అంటే సుప్రీంకోర్టు మొదలుకుని జిల్లా న్యాయస్థానం వరకు అవి ఎలా పనిచేస్తాయనేది ఇందులో పొందుపరిచారు. దేశ ప్రజలు న్యాయం పొందే పద్ధతులతో పాటు వీటికి సంబంధించిన పలు విస్తృత అంశాలు, సమస్యల గురించి వివరించారు. 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ఎన్‌సీఈఆర్‌టీ దీన్ని ప్రచురించింది.

పాత పాఠ్యపుస్తకాల్లో అవినీతి ప్రస్తావనం లేదు. సవరించిన పుస్తకంలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. పాత బుక్స్ లల్లో న్యాయస్థానాల నిర్మాణం, పాత్రపై మాత్రమే దృష్టి సారించగా సవరించిన ఎడిషన్.. న్యాయవ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే వ్యవస్థాగత సమస్యలను విశ్లేషించింది. ముఖ్యంగా- దీనిలోని ఓ విభాగం న్యాయవ్యవస్థలోని అవినీతిని, పేదలపై దాని ప్రతికూల ప్రభావాన్ని వివరించింది.

న్యాయవ్యవస్థలో అవినీతి ప్రభావాన్ని ఈ అధ్యాయంలో కూలంకషంగా వివరించారు. "ప్రజలు న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతిని అనుభవిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాలకు ఇది న్యాయం పొందే అంశాన్ని మరింత కఠినతరం చేస్తుంది.." అనేది దాని సారాంశం. "అందుకే, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి, పారదర్శకతను పెంపొందించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికత వినియోగంతో సహా, అవినీతిని గుర్తించిన చోట త్వరితగతిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు." అని రాసుకొచ్చారు.

అలాగే- సుప్రీంకోర్టులో దాదాపు 81,000, ఉన్నత న్యాయస్థానాల్లో 62.40 లక్షలు, జిల్లా, దిగువ న్యాయస్థానాల్లో సుమారు 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది- సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ సంస్థ ప్రతిష్టను అపఖ్యాతి పాలుచేయడానికి, దీన్ని దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించబోనని, తగిన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధమైన చర్యగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+