Article 370 రద్దుపై కాసేపట్లో సుప్రీం కీలక తీర్పు-జమ్మూకశ్మీర్ లో అల్లర్లు జరగకుండా హైఅలర్ట్..!
దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం గతంలో తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమా కాదా అనేది సుప్రీంకోర్టు ఇవాళ తేల్చేయబోతోంది. ఆర్టికల్ 370 రద్దును కశ్మీర్ లో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కశ్మీర్ ను మూడు ముక్కలు చేయడం సరికాదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జమ్మూకశ్మీర్ లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత పెంచుతున్నారు.
నాలుగేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తీవ్రవాదాన్ని అంతం చేసే పేరుతో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసినా ఇప్పటికీ అక్కడ దాడులు ఆగలేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. అప్పటికే జమ్మూ కశ్మీర్ లో ప్రాంతీయ పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా.. తీవ్రవాదం తగ్గకపోవడంతో మరింత మంది దీనిపై అభ్యంతరాలు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి.

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదాను నిరాకరించే ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమా కాదా అన్న అంశం చివరికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ తుది తీర్పు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు దాదాపు ఫైనల్ కావడంతో జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు.
ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్ధిస్తే జమ్మూ కశ్మీర్లో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడికి ప్రత్యేక బలగాలు పంపింది. మరోవైపు ఆర్టికల్ 370ని కేంద్రం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదని పిటిషనర్లు ఈ కేసులో వాదించారు. ఎందుకంటే 1957లో రద్దు చేసిన తర్వాత రాజ్యాంగ సభ అధికారాలు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి అప్పగించారని వాదిస్తున్నారు
మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 370 రద్దును ఎవరు సిఫార్సు చేయొచ్చని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం రాజ్యాంగం తాత్కాలికంగా పేర్కొన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి రాజ్యాంగ సభ ఆమోదం అవసరం. రాజ్యాంగ పరిషత్ రద్దు తర్వాత ఆర్టికల్ ఎలా శాశ్వతమైందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఎన్నో సంక్షిష్టమైన ఈ ఆర్టికల్ 360 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications