పదేళ్లు జైలే: చౌతాలా పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 2000 నాటి ఉపాధ్యాయ నియామకం కుంభకోణంలో చౌతాలాతోపాటు ఆయన కుమారుడు, మరో ముగ్గురికి 2013 జనవరి 16న ట్రయల్ కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది.
మే 5న ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. దీంతో నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 80 ఏళ్ళ చౌతాలా దీనిపై సుప్రీం కోర్టులో మరోసారి అప్పీల్ చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని సోమవారం తిరస్కరించింది.

చౌతాలా కుమారుడైన 54 ఏళ్ళ అజయ్ సింగ్ చౌతాలాతో పాటు ఇతర నిందితుల పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని సుప్రీం పేర్కొంది. ఆరోగ్యపరమైన సమస్యలపై పెరోల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని వారికి సూచించింది.












Click it and Unblock the Notifications