వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Supreme Court: యోగీ ప్రభుత్వానికి లాస్ట్ చాన్స్, కోర్టు అంటే లెక్కలేదా, ఏం చెయ్యాలో చూపిస్తాం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసిన సందర్బంగా ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రవర్థించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని, మీ తీరు చూస్తుంటే మీరు కోర్టు తీర్పును గౌరవిస్తున్నారా ? అనే అనుమానం వస్తోందని ఉత్తరప్రదేశ్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వెంటనే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, మీ ప్రభుత్వ తీరు మార్చుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. మీరు మీ పద్దతి మార్చుకోకుంటే కోర్టు ఆదేశాలను ఎలాపాటించాలో మేము చూపిస్తామని సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారికి నోటీసులు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి ఆస్తుల రికవరీ చెయ్యడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో పిటిషనర్లు సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది. ఇదే మీకు లాస్ట్ చాన్స్ అంటూ ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం తరుపు న్యాయవాదికి సుప్రీం కోర్టు చెప్పింది.

Hijab Row: హిజాబ్ vs కాషాయం, రంగంలోకి సాయుధబలగాలు, విద్యాసంస్థలు ఓపెన్ !Hijab Row: హిజాబ్ vs కాషాయం, రంగంలోకి సాయుధబలగాలు, విద్యాసంస్థలు ఓపెన్ !

నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం

నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం

2019లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారికి నోటీసులు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి ఆస్తుల రికవరీ చెయ్యడానికి ప్రయత్నించింది. ఉత్తరప్రదేశ్ లో పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జిల్లాస్థాయి అధికారులు పలువురిని నోటీసులు జారీ చేశారు.

 106 ఎఫ్ఐఆర్ లు, 274 మందికి నోటీసులు

106 ఎఫ్ఐఆర్ లు, 274 మందికి నోటీసులు

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లో 833 చోట్ల గొడవలు జరిగాయి. ఇప్పటికే 106 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ 274 మందికి నోటీసులు జారీ చేశామని, వాటిలో 38 కేసులు రద్దు అయ్యాయని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది గిరిమా ప్రసాద్ ఇప్పటికే కోర్టుకు సమాచారం ఇచ్చారు.

 ఏకపక్షంగా నోటీసులు ఇచ్చారని పిటిషన్ !

ఏకపక్షంగా నోటీసులు ఇచ్చారని పిటిషన్ !


ఉత్తరప్రదేశ్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ పర్వేజ్ ఆరీఫ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నోటీసులు జారీ చేసిందని, 94 ఏళ్ల వ్యక్తి, 90 ఏళ్ల వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని నోటీసులు జారీ చేశారని నోటీసులు జారీ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, మీరే న్యాయం చెయ్యాలని పిటిషనర్ సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

నోటీసులు రద్దు చెయ్యాలని చెప్పిన సుప్రీం కోర్టు

నోటీసులు రద్దు చెయ్యాలని చెప్పిన సుప్రీం కోర్టు


పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసిన సందర్బంగా జరిగిన పరిణామాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను రద్దు చెయ్యాలని సుప్రీం కోర్టు ఇంతకు ముందే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాటించలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ కూడిన ధర్మాసనం చెప్పింది.

యోగీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు

యోగీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు


మీరు మీ పద్దతి మార్చుకోకుంటే కోర్టు ఆదేశాలను ఎలాపాటించాలో మేము చూపిస్తామని సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారికి నోటీసులు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి ఆస్తుల రికవరీ చెయ్యడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో పిటిషనర్లు సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది. ఇదే మీకు లాస్ట్ చాన్స్ అంటూ ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం తరుపు న్యాయవాదికి సుప్రీం కోర్టు చెప్పింది. ఉత్దరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఆ రాష్ట్రంలోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారని కొందరు న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
Last Chance: The Uttar Pradesh government was told off by the Supreme Court for recovering fines by the alleged 2019 anti-Citizenship (Amendment) Act protesters, adding that that the act was in violation of the laws laid down by the court and asked it to stop right away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X