వాట్సాప్ లేకపోతే.. ? ఆ యాప్ వాడుకోమన్న సుప్రీంకోర్టు..!
ఇవాళ సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తన అకౌంట్ ను వాట్సాప్ బ్లాక్ చేసిందని, దాన్ని పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు కీలక సూచన చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోతకు కౌంటర్ గా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ఉత్పత్తులకు పోటీగా స్వదేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో గతంలో అసాధ్యమని భావించిన ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. ఇదే క్రమంలో తన వాట్సాప్ ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు దాని స్ధానంలో స్వదేశీ యాప్ అరాట్టైను వాడుకోవచ్చు కదా అని సూచించింది.

తన ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి.. ఇలా సోషల్ మీడియా సంస్థలు సడన్ గా వాటిని బ్లాక్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఇది తన ప్రాధమిక హ్కకు అని వాదించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆర్టికల్ 32 కింద వాట్సాప్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వడం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది.

వాట్సాప్ లేకపోతే ఇతర స్వదేశీ యాప్ లు ఉన్నాయని, తాజాగా అరాట్టై అనే యాప్ కూడా వచ్చిందని, వాటిని వాడుకోకుండా ఇలా పిటిషన్ వేయడం ఏంటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ఇది హైకోర్టు కూడా విచారణ జరిపే వాజ్యం కాదని తేల్చేసింది. ఈ మేరకు ఈ వాజ్యాన్ని తోసిపుచ్చుతూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పిటిషనర్ చేసేది లేక తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications