వలస కూలీల పిటీషన్ పై సుప్రీంలో విచారణ .. సుప్రీం కీలక ఆదేశాలివే

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న సర్కార్ సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తుంది. ఇక ఈ క్రమంలో
లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మన ఆకలి కేకల భారతం ఎలా ఉందో పాలకుల పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది.

వలస కూలీల విషయంలో స్టేటస్ రిపోర్టును సమర్పించిన కేంద్రం

వలస కూలీల విషయంలో స్టేటస్ రిపోర్టును సమర్పించిన కేంద్రం

వలస కార్మికులను పట్టించుకునే నాధుడు లేక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పొట్ట చేతబట్టుకుని వందలాది కిలోమీటర్ల దూరం మేర నడిచి వెళ్తున్న వలస కార్మికుల పరిస్థితిపై అలోక్ శ్రీవాత్సవ్ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ఇవ్వాళ సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది . ఈ పిటిషన్ పై సీజెఐ ఎస్.ఏ.బాబ్డే ఆధ్వర్యాన గల ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ జరిపిన విచారణలో వలస కూలీల విషయంలో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది కేంద్రం.

వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీం కు చెప్పిన కేంద్రం

వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీం కు చెప్పిన కేంద్రం

కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం జనవరి 17 నుంచే ముందస్తు నివారణ చర్యలు చేపట్టిందని, ఇక వలస కార్మికుల విషయంలో కూడా వారికి ఇబ్బంది కలుగకుండా నిర్ణయం తీసుకుందని చెప్పింది . సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వలస కార్మికుల విసయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళారు. వలసకూలీల కోసం అన్ని రాష్ట్రాల్లో వసతి గృహాలు ఏర్పాటు, భోజన వసతి, స్క్రీనింగ్, మెడికల్ వసతులు కల్పించామని తెలిపారు సొలిసిటరీ జనరల్ . అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాల మేరకు వలసకూలీలను వసతి గృహాలకు తరిలించినట్లు చెప్పారు.ఇక వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు .

విచారణ తర్వాత సుప్రీం కీలక ఆదేశాలు

విచారణ తర్వాత సుప్రీం కీలక ఆదేశాలు


అయితే పిటీషనర్ తరపున న్యాయవాది వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదించారు. దీంతో సుప్రీం ధర్మాసనం వలసకూలీలకు వసతి గృహాలు, భోజనం, మెడికల్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు "ఫేక్ న్యూస్" నివారణకు ప్యానెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. తప్పుడు ప్రచారాలను ఆపాలని సూచనలు చేసింది . ప్రజలకు సమాచారం ఇచ్చేందుకే పోర్టల్ , నిపుణుల కమిటీని 24 గంటల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+