111 మంది అమ్మాయిలకు సకల లాంఛనాలతో పెళ్లి చేసిన సూరత్ వజ్రాల వ్యాపార వేత్త
న్యూఢిల్లీ: సూరత్ వజ్రాల వ్యాపారవేత్త మహేష్ సవానీ పేరు ఇటీవల వార్తల్లో తరచూ వినిపిస్తున్న పేరు. పేదరికం, తండ్రిని కోల్పోయిన దురదృష్టంతో ఇబ్బంది పడుతున్న 111 మంది అమ్మాయిలకు ఆదివారం సకల లాంఛనాలతో పెళ్లి జరిపించాడు.
సూరత్ లోని అబ్రామాలో ఈ పెళ్లి జరిగింది. ఈ మ్యారేజి వేడుకలో స్ధానిక వ్యాపరవేత్త మహేష్ సవానీ 111 మంది అమ్మాయిలకు కన్యాదానం చేశారు. రూ.4.5 లక్షలతో గోల్డ్, సిల్వర్, ఫర్నిచర్ లతో పాటు ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లను 111 మంది కూతుళ్లకు కొనిపెట్టాడు.

ఇక ఈ పెళ్లి వేడుకలకు డబ్బులు వృధాగా ఖర్చుపెట్టకుండా, దండలు మార్చుకోని ముందే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. దేవుడే తమకు మహేష్ సవానీని తండ్రిలా పంపించాడని అక్కడ పెళ్లి చేసుకోనే ఈ అమ్మాయిలు చెప్పారు. తనతో పాటు తన చెల్లి, తమ్ముళ్లకు కూడా ఆయన తండ్రి అని నరోలా అనే అమ్మాయి చెప్పింది.
ఈ సందర్భంలో వ్యాపారవేత్త మహేష్ సవానీ మాట్లాడుతూ అమ్మాయిలకు పెంపుడు తండ్రిగా పెళ్లిళ్లు చేయడం సంతోషంగా ఉంది. తండ్రులను కోల్పోయిన ఈ 111 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలని నా తమ్ముడు రాజుభాయ్, నేను నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ అమ్మాయిల్లో ముగ్గురు ముస్లింలు కూడా ఉన్నారన్నారు.
2007 నుంచి ఈ తరహా పెళ్లిళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 251 మంది అమ్మాయిలకు పెంపుడు తండ్రిగా బాధ్యతలు తీసుకుని పెళ్లిళ్లు చేశానని చెప్పుకొచ్చారు. మ్యారేజీ అనంతరం ప్రసూతికి అయ్యే ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications