వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్క్ ధరించలేదని-వివాహితపై కానిస్టేబుల్ రేప్-నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్,నెలల తరబడి అత్యాచారం

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో దారుణం వెలుగుచూసింది. మాస్కు ధరించలేదన్న కారణంతో ఓ వివాహితపై ఓ పోలీస్ కానిస్టేబుల్ జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్‌కు రాక తప్పదని ఆమెను బెదిరించి వెంట తీసుకెళ్లాడు. తీరా స్టేషన్‌కు కాకుండా మరో చోటుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె నగ్న ఫోటోలు చిత్రీకరించిన కానిస్టేబుల్... ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని నెలల తరబడి పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. గతేడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఉన్న పల్సానా పోలీస్ స్టేషన్ పరిధిలో 33 ఏళ్ల ఓ వివాహిత భర్తతో కలిసి నివసిస్తోంది. గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో పాల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ముఖానికి మాస్కు ధరించలేదన్న కారణంతో స్థానిక పోలీస్ కానిస్టేబుల్ నరేశ్ కపాడియా ఆ వివాహితపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో పాటు పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. పలుమార్లు రేప్

ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. పలుమార్లు రేప్

తీరా కారెక్కాక... పోలీస్ స్టేషన్‌కు కాకుండా నవ్సారి రోడ్ మార్గం వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను భయభ్రాంతులకు గురిచేసిన కానిస్టేబుల్ బలవంతంగా దుస్తులు విప్పించి... ఆమెపై దాడి చేశాడు. ఆపై తన సెల్‌ఫోన్‌లో ఆమె నగ్న ఫోటోలు తీశాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మరుసటిరోజు నుంచి ఆమె నగ్న ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి పైనే కేసు...

బాధితురాలి పైనే కేసు...

ఈ ఏడాది జనవరిలో బాధితురాలితో కానిస్టేబుల్ నరేశ్ కపాడియా గొడవ పడుతున్న వీడియో ఒకటి స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కపాడియాను పల్సానా పోలీస్ స్టేషన్ నుంచి ఉమర్‌పాదా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇదే క్రమంలో నరేశ్ కపాడియా,అతని భార్య పార్వతి బాధితురాలితో పాటు ఆమె భర్తపై బర్దోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు తమ ఇంటికి వచ్చి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీంతో కానిస్టేబుల్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన వివాహితతో పాటు ఆమె భర్తపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

Noorjahan Mango Costs ₹ 1,000 Per Piece|Madhya Pradesh | Oneindia Telugu
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం?

ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం?

మాస్కు ధరించలేదన్న కారణంతో కానిస్టేబుల్ తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెబుతుండటం... మరోవైపు కులం పేరుతో ఇంటికొచ్చి దూషించారని కానిస్టేబుల్ దంపతులే బాధితురాలు,ఆమె భర్తపై కేసు పెట్టడం... ఇదంతా చూస్తుంటే అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇరువురి ఆరోపణలు పక్కనపెడితే... ఆ వివాహితకు,కానిస్టేబుల్‌కు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబందం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇలా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.

English summary
The survivor alleged that during the 2020 lockdown, she was on her way to buy milk in Palsana when the accused allegedly abducted her. The accused threatened the woman with police action as she was not wearing a mask. Instead of taking the woman to the police station, the accused took her to Navsari Road where he allegedly stripped and thrashed her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X