రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష-సూరత్ కోర్టు సంచలన తీర్పు-మోడీపై కామెంట్స్ కేసులో

సూరత్ : కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో ఎంపీ రాహుల్ గాంధీ గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావా కేసు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది.

2019 ఏప్రిల్ నెలలో యూపీలోని కరోల్ లో నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఉద్దేశించి పలువ్యాఖ్యలు చేశారు. ఇందులో దొంగలంతా మోడీ ఇంటిపేరుతోనే ఉంటారెందుకో అంటూ రాహుల్ గాంధీ ఓ అనుచిత వ్యాఖ్య చేశారు. ప్రధాని మోడీతో పాటు లలిత్ మోడీ, నీరవ్ మోడీ వారి పేర్లను ఇందులో రాహుల్ ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ఆ తర్వాత రాహుల్ పై పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. వీటిపై సూరత్ కోర్టులో విచారణ జరిగింది.

surat court convicts rahul gandhi in defamation case over modi surname remarks, order 2 year jail

ప్రధాని మోడీపై ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యల వ్యవహారం ద్వారా మోడీ ఇంటిపేరున్న తన పరువుకు నష్టం కలిగించారనేఆరోపణలతో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పిర్యాదు చేశారు. రాహుల్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... సూరత్ కోర్టుకు ఆధారాలు సమర్ఫించారు.దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సూరత్ కోర్టు.. ఇవాళ తుది తీర్పు ప్రకటించింది. ఇందులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15000 జరిమానా కూడా విధించింది.

మరోవైపు రాహుల్ గాంధీని ఈ కేసులో దోషిగా నిర్దారించిన సూరత్ కోర్టు.. అనంతరం ఆయన అభ్యర్ధనపై బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+