వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ వ్యూహం మార్చింది: ఉగ్రవాదులు ‘ఆర్మీ’ని టార్గెట్ చేస్తున్నారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాదులు ఎందుకు వ్యూహం మార్చారు అని అధికారులు ఆరా తీశారు. భారతీయులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తే ఏకాకి అయిపోతామని భావించిన పాక్ తమ ఉగ్రవాదులకు సరి కొత్త ప్లాన్లు ఇస్తుందని రక్షణ శాఖ నిపుణులు అంటున్నారు.

2008 ముంబై ఉగ్రదాడుల్లో అనేక మంది అమాయకులు బలి అయ్యారు. వారిలో విదేశీయులు ఉన్నారు. ఆసందర్బంలో భారత్-పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఊరీ ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్ పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత ఆర్మీ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇప్పుడు భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

2008 ముంబై దాడుల తరువాత అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి చెయ్యడంతో పాక్ తన పంతా మార్చుకుంది. భారతీయులను లక్షంగా చేసుకుంటే పాక్ మీద ఆరోపణలు వస్తాయని గ్రహించింది. అలా కాకుండా భారత సైనికులను లక్షంగా చేసుకోవాలని పాకిస్థాన్ ప్లాన్ వేసింది.

Surgical Strikes and the future of Indian military responses

అలా చేస్తే కాశ్మీర్ కోసం పోరాటం చేస్తున్న మిలిటెంట్లు భారత ఆర్మీ మీద దాడి చేశారని ఆ నేరం మిలిటెంట్ల మీద వేయోచ్చని స్కెచ్ వేసింది. అంతే భారత సైనికులను లక్షంగా చేసుకుని 2015 నుంచి ఇప్పటి వరకు దాడులు చేయిస్తుంది.

ఊరీ సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో 19 మంది భారత సైనికులు మరణించారు. ఈఘటనకు మూడు నెలల ముందు పాంపోర్ సమీపంలోని సీఆర్ పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చెయ్యడంతో 8 మంది సైనికులు మరణించారు.

2015 డిసెంబర్ లో భారత సైనిక 31వ రిజిమెంట్ అర్డినెన్స్ క్యాంప్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓలెఫ్ట్ నెంట్ కల్నల్ తో సహ 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు మరణించారు. భారత సైనికులను లక్షంగా చేసుకుని దాడులు చేయాలని పాక్ వ్యూహాన్ని మార్చుకునింది.

పాక్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారని రక్షణ శాఖ నిపుణులు తెలిపారు. సైనికులు, పోలీసులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు అది మిలిటెంట్ల పోరాటం అవుతుందని పాక్ ప్లాన్ వేసిందని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ముంబై దాడులు తరువాత పౌరులపై 90 శాతం వరకు దాడులు తగ్గాయని వారు అంటున్నారు. ఇదే సమయంలో పాక్ ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత సైన్యం, పోలీసుల మీద దాడులు చేయిస్తుందని రక్షణ శాఖ నిపుణులు తెలిపారు.

English summary
The Indian Army had undertaken many cross LoC and cross border raids in the pursuit of the militants. On the eastern borders, these raids mostly took with the consent of the neighbouring States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X