కర్ణాటక స్కెచ్, మధ్యప్రదేశ్ కు సుర్జేవాల, తెలంగాణకు దీపా, హైకమాండ్ ప్లాన్ తో !
భోపాల్/బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. త్వరలో వివిద రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్లాన్ ను రిపీట్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది.
ఇప్పుడు కర్ణాటక స్కెచ్ లను వివిద రాష్ట్రాల్లో ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక సందర్బంగా ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాల వ్యవహరించారు. కేపీసీసీ నాయకులతో కలిసి పని చేసిన రణదీప్ సింగ్ సూర్జేవాల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు రణదీప్ సింగ్ సూర్జేవాల మీద ఇంకా నమ్మకం పెరగడంతో ఆయనకు మరో రాష్ట్రం బాధ్యతలు అప్పగించారు.

త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో లాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను రణదీప్ సింగ్ సూర్జేవాలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్పగించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా, పార్టీ సమన్వయకర్తగా రణదీప్ సింగ్ సూర్జేవాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించింది.
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ బలంగా పుంజుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి కలవరం మొదలైయ్యింది. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సూర్జేవాల స్కెచ్ లు వేస్తున్నారు. రాజస్థాన్ లో మిస్త్రీకి గడ్డుకాలం ఎదరైయ్య అవకాశం ఉంది. ఎందుకుంటే అక్కడి సీఎం అశోక్ గుహ్లాట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ మధ్య తేడాలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకుల వర్గపోరు కారణంగా ఆ రాష్ట్రాంలో ఆ పార్టీకి నానా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఇదే సమయంలో రాజస్థాన్ లో లాభం పొందాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇక ఛత్తీస్ గఢ్ లో టీఎస్. సింగ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇంతకాలం బ్యాలెన్స్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీని రాజస్థాన్ పార్టీ సీనియర్ పరిశీలకులుగా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ ను ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమించింది. మిజోరం పరిశీలకులుగా ఏఐసీసీ సీనియర్ నాయకుడు. పార్టీ క్రమశిక్షణ విభాగం ఇన్ చార్జ్ సచిన్ రావ్ ను నియమించారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహార పరిశీలకులుగా పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దీపా దాష్మన్ష్నీని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిరివెళ్ల ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఛత్తీస్ గఢ్ లో కొన్ని బాధ్యతలు అప్పగించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ పార్టీ వార్ రూమ్ ఇన్ చార్జ్ గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కు కాంగ్రెస్ పార్టీ మరోసారి బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ లో మిస్త్రీకి సహాయకుడిగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పరిశీలకులుగా ముంబాయి మాజీ మేయర్ చంద్రకాంత్ హండోర్, ఛత్తీస్ గడ్ కు మీనాక్షి నటరాజ్ ను వార్ రూప్ ఇన్ చార్జ్ లుగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications