చిదంబరంతో సచిన్ మంతనాలు: హైకమాండ్‌తో మాట్లాడాలని చిద్దు సజెస్ట్, వేలాడుతోన్న అనర్హత కత్తి..
రాజస్తాన్ రాజకీయాలు పూట పూటకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్, అతని మద్దతుదారులకు స్పీకర్ సీపీ జోషి అనర్హత నోటీసులు ఇవ్వగా.. దానిని పైలట్ హైకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం పూర్తి వివరాలతో పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే పైలట్‌ను సొంత గూటికి రావాలని కాంగ్రెస్ నేతలు పదే పదే కోరుతున్నా.. అంతగా స్పందించలేదు. ప్రియాంక గాంధీ చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. కానీ గురువారం ఆశ్చర్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో సచిన్ పైలట్ మాట్లాడారు. దీనినిబట్టి చూస్తే తన సమస్యల పరిష్కారంపై హై కమాండ్ స్పష్టమైన హామీ కావాలని పైలట్ కోరుతున్నట్టు అర్థమవుతోంది.

చిదంబరంతో మంతనాలు
అనర్హత నోటీసులపై రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత.. చిదంబరంతో పైలట్ మాట్లాడారు. చిదంబరం సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు కూడా.. ఈ క్రమంలో ఆయనకు తన సమస్యను తీసుకెళ్తే.. పరిష్కారం అవుతోందని పైలట్ భావించి ఉంటారు. తాను పైలట్‌తో మాట్లాడానని, హై కమాండ్ పెద్దలతో మాట్లాడాలని సూచించానని ప్రముఖ పత్రికకు చిదంబరం తెలిపారు. అగ్ర నేతలతో సమావేశమైతే అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సలహా ఇచ్చాను అని చిదంబరం తెలిపారు.

వెల్ కం..
మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. వస్తే అతనికి సముచిత గౌరవం ఇస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని నొక్కి వక్కానించారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే.. తిరిగి రావడంపై స్పష్టత ఇవ్వకపోవడంతో అనర్హత వేటుపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

3 రోజుల్లోపు..?
వాస్తవానికి స్పీకర్ నోటీసుల తర్వాత మూడురోజుల లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకుంటే సదరు సభ్యుడు/సభ్యులు అనర్హతకు గురయ్యారని స్పీకర్ కార్యాలయం ప్రకటిస్తోంది. కానీ పైలట్ స్పష్టమైన సంకేతాలు ఇస్తే.. ఆ ప్రక్రియను నిలుపుదల చేయొచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమకు పైలట్ తిరిగి రావడం ముఖ్యమని, దాంతోపాటు రాజస్తాన్‌లో పార్టీ అధికారం కంటిన్యూ చేయడం కూడా అని తేల్చిచెప్పారు.
Recommended Video

మిగిలింది గంటలే
రాజస్తాన్ స్పీకర్ పైలట్ సహా 18 మందికి ఇచ్చిన నోటీసులపై శుక్రవారం మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ లోపు చర్చలు జరిగి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థనను వెనక్కి తీసుకుంటే ఫరవాలేదు. లేదంటే అనర్హత వేటు వారి మేడపై వేలాడుతూనే ఉంది. మరోవైపు అనర్హత నోటీసులపై కాంగ్రెస్ తరఫున వాదిస్తోన్న అభిషేక్ సింగ్వి మాత్రం సరికాదని అంటున్నారు. పదో షెడ్యూల్‌ను 1992లో సవరించారని గుర్తుచేశారు. మరి అలాంటప్పుడు పాత పద్దతిలో అనర్హత నోటీసును ఎలా సవాల్ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications