భర్తకు స్వేచ్ఛనిస్తానని.. అవాక్కయ్యే పెళ్లి ప్రమాణం చేసిన వధువు!
చాలామంది పెళ్లయిన తర్వాత స్వేచ్ఛ, స్వాతంత్రాలు పోయాయని తెగ బాధపడుతూ ఉంటారు. పెళ్లితోనే తమ స్వేచ్ఛకు బ్రేక్ పడుతుందని వాపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి తర్వాత అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరూ పెళ్లి చేసుకుంటే ఇక లైఫ్ అంతా బంధీనే అన్నట్టు ఫీల్ అవుతారు.
పెళ్ళిలో అరుదైన సంఘటన
పెళ్లికి ముందే హ్యాపీగా ఉండేవాణ్ణి ఫ్రెండ్స్ తో తిరిగే వాడిని, పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి ఆ సంతోషం లేదంటూ చెప్పుకునే వాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఈ క్రమంలోనే భర్తకు స్వేఛ్చ ఇస్తానని తాజాగా ఓ వధువు పెళ్లిలోనే ఒక ఆసక్తికరమైన ప్రమాణాన్ని చేశారు. పెళ్లయిన తర్వాత భర్తకు పూర్తి స్వేచ్ఛను ఇస్తానని వధువు, స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి మరీ ప్రమాణం చేశారు .

స్నేహితుడి పెళ్లి.. పెళ్లి తర్వాత కలవడని బాధలో స్నేహితులు
ఇక ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని మైలాడు దురై జిల్లా సీర్గాళి సమీప తెన్ పాడికి చెందిన ముత్తుకుమార్ కురింజీపాడి కి చెందిన పవిత్ర తో ఇటీవల వివాహం జరిగింది. ఇక వివాహ వేడుకలో పాల్గొన్న ముత్తు కుమార్ స్నేహితులు వివాహం తర్వాత వరుడు ఇక తమన కలవడేమోనని బాధపడ్డారు.
100 రూపాయల స్టాంప్ పేపర్ పైన రాయించుకున్న వరుడి స్నేహితులు
ఇక ఇదే సమయంలో వారు ఒక ఆలోచన చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకువచ్చి వధువు తో భర్తకు స్వేచ్ఛనిస్తానని స్టాంప్ పేపర్ మీద రాయించి సంతకం చేయించుకున్నారు. పెళ్లయిన తర్వాత స్నేహితులతో సంతోషంగా గడపడానికి అనుమతిని ఇస్తానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా భర్తను అడ్డుకోనని భార్య తన ఇష్టపూర్తిగా రాసిచ్చినట్టు ఆమెతో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయించుకుని సంతకం చేయించుకున్నారు.
భర్తకు సేచ్చనిస్తానని ప్రమాణం చేసిన వధువు
ఆమె కూడా తన భర్త కోసం ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా సంతోషంగా స్టాంప్ పేపర్ పైన సంతకం చేశారు. వివాహం తర్వాత కూడా తన భర్తకు స్వేచ్ఛనిస్తానని వధువు పెళ్లి వేదికగా ప్రమాణం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అరుదైన ఘటన విన్న నటిజెన్లు దీనిపైన భిన్నంగా స్పందిస్తున్నారు. అబ్బా అందరి పెళ్ళిలో ఇలాగే చేస్తే బాగుంటుంది అని అబ్బాయిలు అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో చర్చ
ఇక అమ్మాయిలైతే అబ్బాయిల కెనా స్వేచ్ఛ అమ్మాయిలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అబ్బాయి కూడా అమ్మాయికి స్వేచ్ఛనిస్తానని, స్నేహితులతో సంతోషంగా కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి అనుమతిని ఇస్తానని స్టాంప్ పేపర్ మీద రాసిస్తే బాగుండేది అని ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అరుదైన ఈ ఘటన ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications